పాయింట్ల పట్టికలో(DC vs CSK Full Scorecard) తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల పోరులో దిల్లీదే(delhi capitals playoffs 2021) పైచేయి. సోమవారం(అక్టోబర్ 4) ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 3 వికెట్ల తేడాతో చెన్నైపై(DC vs CSK Live) విజయం సాధించింది. రాయుడు (55 నాటౌట్; 43 బంతుల్లో 5×4, 2×6) పోరాడడంతో మొదట చెన్నై 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (2/18), అశ్విన్ (1/20) చెన్నైకి కళ్లెం వేశారు. నార్జ్, అవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. రబాడ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చాడు. ధావన్ (39; 35 బంతుల్లో 3×4, 2×6), హెట్‌మయర్ (28 నాటౌట్; 18 బంతుల్లో 2×4, 1×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది(Indian Premier League 2021). శార్దూల్ (2/13), జడేజా (2/28) గొప్పగా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది.
నిలిచిన ధావన్: స్పల్ప ఛేదనలో దిల్లీకి(DC vs CSK IPL Match Result) మంచి ఆరంభమే లభించింది. చకచకా మూడు బౌండరీలు బాదిన పృథ్వీ షా (18)ను త్వరగానే కోల్పోయినా.. 5 ఓవర్లు ముగిసే సరికి దిల్లీ 48/1తో నిలిచింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ధావన్ వరుసగా 6, 4, 4, 6 కొట్టాడు. అయితే ఆరో ఓవర్లో శ్రేయస్ (2)ను(shreyas iyer ipl team 2021) హేజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన పంత్ (15; 12 బంతుల్లో 1×4, 1×6)ను 9వ ఓవర్లో అలీ ఔట్ చేసేటప్పటికి స్కోరు 71. సాధించాల్సిన రన్‌రేట్ ఆరు లోపే ఉండడం, ధావన్ క్రీజులో కుదురుకుని ఉండడంతో దిల్లీపై చెన్నై పెద్దగా ఒత్తిడి తేలేకపోయింది. 12.4 ఓవర్లలో 93/3తో దిల్లీ సాఫీగా లక్ష్యం దిశగా సాగుతునట్లనిపించింది. ఆ జట్టు గెలుపు పెద్ద కష్టమేమీ కాదనిపించింది. కానీ దిల్లీకి కష్టపడక తప్పలేదు .మ్యాచ్ అనూహ్యంగా ఆసక్తికరంగా మారింది. 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టిన చెన్నై పోటీలోకి వచ్చింది. మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్న రిపల్ పటేల్ (18; 20 బంతుల్లో 2×4)ను జడేజా వెనక్కి పంపితే.. 14వ ఓవర్లో అశ్విన్, ధావన్‌ను ఔట్ చేయడం ద్వారా శార్దూల్ దిల్లీకి షాకిచ్చాడు. హెట్‌మయర్ తోడుగా అక్షర్ నిలబడ్డా.. బౌండరీలు రాకపోవడం, సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడం వల్ల దిల్లీపై ఒత్తిడి పెరిగింది.
ఆ క్యాచ్ పట్టుంటే..: చివరి 3 ఓవర్లలో దిల్లీకి 28 అవసరమైన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 18వ ఓవర్లో హెట్‌మయర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద కృష్ణప్ప గౌతమ్ (సబ్‌స్టిట్యూట్) వదిలేసి ఉండకపోతే మ్యాచ్ చెన్నై వైపు తిరిగేదేమో. గౌతమ్ చేతుల్లో నుంచి జారి పడ్డ బంతి బౌండరీ దాటింది. బ్రావో వేసిన ఆ ఓవర్లో 12 పరుగులొచ్చాయి. హెట్‌మయర్ ఓ సిక్స్ బాదడంతో తర్వాతి ఓవర్లో దిల్లీకి మొత్తం 10 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో ఆ జట్టుకు 6 పరుగులే అవసరమైనా, బ్రావో పేలవంగా బౌలింగ్ చేసినా.. ఉత్కంఠ తప్పలేదు. చివరి 4 బంతుల్లో 2 పరుగులు అవసరమైన దశలో అక్షర్ ఔటయ్యాడు. అయితే తర్వాతి బంతిని బౌండరీకి తరలించడం ద్వారా రబాడ పని పూర్తి చేశాడు.
రాణించిన రాయుడు: చెన్నై(Indian Premier League 2021) సాధించింది తక్కువ స్కోరే. కానీ ఆ మాత్రం పరుగులైనా చేసిందంటే ప్రధాన కారణం అంబటి రాయుడే(ambati rayudu ipl 2021 team). బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై చక్కని ఆటతో అతడు జట్టును ఆదుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలో తడబాటు తప్పలేదు. దిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టును దెబ్బతీశారు. చెన్నై 11 ఓవర్లలో 72 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుని ఇబ్బందుల్లో పడింది.. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు డుప్లెసిస్ (13), రుతురాజ్ గైక్వాడ్ (10) ఈసారి విఫలమయ్యారు. మూడో ఓవర్లో డుప్లెసిస్‌ను ఔట్ చేయడం ద్వారా చెన్నై పతనాన్ని ఆరంభించిన అక్షర్ పటేల్. ఎనిమిదో ఓవర్లో మొయిన్ అలీ (5)ని వెనక్కి పంపాడు. ఈ మధ్యలో ప్రమాదకర రుతురాజ్‌ను నార్జ్ ఔట్ చేశాడు. ఉతప్ప (19; 19 బంతుల్లో 1×4) కాసేపు నిలిచినా ధాటిగా ఆడలేకపోయాడు. అశ్విన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోని, రాయుడు బ్యాట్ ఝుళిపించలేకపోవడంతో స్కోరు వేగం తగ్గింది. అశ్విన్, అక్షర్ వారిని స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. అవేష్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రాయుడు రెండు ముచ్చటైన బౌండరీలు బాదినా స్కోరు బోర్డు వేగాన్నేమీ అందుకోలేదు. తర్వాతి నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులే వచ్చాయి. బౌండరీల ఊసేలేదు. ధోని, రాయుడు(Dhoni ipl 2021) ఇద్దరూ సింగిల్స్‌తోనే సరిపెట్టుకున్నారు. భారీ షాట్లు ఆడడం కష్టమైపోయింది. ధోనీ అయితే మరీ ఇబ్బంది పడ్డాడు. అయితే ఆఖర్లో దూకుడు పెంచిన రాయుడు చెన్నైకి విలువైన పరుగులు అందించాడు. ముచ్చటైన షాట్లతో అలరించాడు. రబాడ ఓవర్లో బౌండరీ కొట్టిన అతడు.. అవేష్ ఖాన్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదాడు. నార్జ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరో ఫోర్, సిక్స్ దంచేశాడు. అయితే ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అవేష్.. కేలం నాలుగు పరుగులే ఇచ్చాడు. 27 బంతుల్లో 18 పరుగులే చేసిన ధోని.. ఒక్క బౌండరీ కూడా కొట్టకుండానే వెనుదిరిగాడు.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అశ్విన్ (బి) నార్జ్ 13; డుప్లెసిస్ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 10; ఉతప్ప (సి) అండ్ (బి) అశ్విన్ 19; అలీ (సి) శ్రేయస్ (బి) అక్షర్ 5; రాయుడు నాటౌట్ 55; ధోని (సి) పంత్ (బి) అవేష్ 18; జడేజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 136, వికెట్ల పతనం: 1-28, 2-39, 3-59, 4-62, 5-132, బౌలింగ్: నార్జ్ 4-0-37-1; అవేష్ ఖాన్ 4-0-35-1; అక్షర్ 4-0-18-2; రబాడ 4-0-21-0; అశ్విన్ 4-0-20-1
దిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) దీపక్ చాహర్ 18; ధావన్ (సి) అలీ (బి) శార్దూల్ 39; శ్రేయస్ అయ్యర్ (సి) రుతురాజ్ (బి) హేజిల్‌వుడ్ 2; పంత్ (సి) అలీ (బి) జడేజా 15; రిపల్ (సి) దీపక్ చాహర్ (బి) జడేజా 18; అశ్విన్ (బి) శార్దూల్ 2; హెట్‌మయర్ నాటౌట్ 28; అక్షర్ పటేల్ (సి) అలీ (బి) బ్రావో 5; రబాడ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 139, వికెట్ల పతనం: 1-24, 2-51, 3-71, 4-93, 5-98, 6-99, 7-135, బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-34-1; హేజిల్‌వుడ్ 4-0-27-1; జడేజా 4-0-28-2; మొయిన్ అలీ 3-0-16-0; శార్దూల్ ఠాకూర్ 4-0-13-2; డ్వేన్ బ్రావో 1.4-0-20-1
ఇదీ చూడండి: MI Vs RR Preview: ముంబయి-రాజస్థాన్.. కీలకపోరులో గెలుపెవరిది?