అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట్స్మెన్లలో డివిలియర్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడా చెరో వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించింది ఓపెనింగ్ జంట. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని ఆవేశ్ ఖాన్ విడగొట్టాడు. కోహ్లీ రూపంలో దిల్లీకి తొలి వికెట్‌ను అందించాడు. తర్వాతి బంతికే ఆర్సీబీకి మరో షాకిచ్చాడు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ. ఓపెనర్ పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బెంగళూరు రన్‌రేట్ తగ్గిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు.
నాలుగో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన డివిలియర్స్(42 బంతుల్లో 75 పరుగులు).. రజత్ పటిదార్‌కు సహకరించాడు. ఆచితూచి ఆడుతూనే 54 పరుగుల భాగస్వామ్యం జోడించారు వీరిద్దరూ. కుదురుకుంటున్నట్లే కనిపించిన పటిదార్(22 బంతుల్లో 31 పరుగులు)ను అక్షర్ బోల్తా కొట్టించాడు. చివర్లో డివిలియర్స్ మెరుగ్గా ఆడాడు. దీంతో ఆర్సీబీ కాపాడుకోనే స్కోరు చేయగలిగింది.
ఇదీ చదవండి: ఐపీఎల్ ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా హామీ