ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. లీగ్‌లోని తమ చివరి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసింది. 135 పరుగుల లక్ష్యాన్ని 8 ఓవర్లు మిగిలుండగానే పూర్తి చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(98) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. అతడి బ్యాటింగ్ ముందు చెన్నై బౌలర్లు తేలిపోయారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్.. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో మొయిన్ అలీ 0, ఉతప్ప 2, రాయుడు 4, ధోనీ 12, జడేజా 15, బ్రావో 4 పరుగులు చేశారు. మరో ఎండ్‌లో డుప్లెసిన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దాదాపు ఇన్నింగ్స్ మొత్తం క్రీజులో నిలబడి 76 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, క్రిస్ జోర్డాన్ తలో 2 వికెట్లు తీయగా.. షమి, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనలో పంజాబ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓవైపు దూకుడుగా ఆట మొదలుపెట్టాడు. మరో ఎండ్‌లోని మయాంక్ అగర్వాల్ 12, సర్ఫరాజ్ ఖాన్ 0, షారుక్ ఖాన్ 8, మార్క్రమ్ 13, హెన్సిక్స్ 3 పరుగులు చేశారు. వీరందరూ తమ వంతు పరుగులు చేయగా, రాహుల్ మాత్రం 98 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టుకు విజయాన్ని అందించాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకుర్ 3, దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇదీ చూడండి.. CSK Vs PBKS: డుప్లెసిస్ హాఫ్‌సెంచరీ.. పంజాబ్ లక్ష్యం 135