ETV Bharat / sports

ఐపీఎల్: రైనా, కరన్ ధనాధన్.. దిల్లీ లక్ష్యం 189

దిల్లీ జట్టుకు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది చెన్నై. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ధోనీ డకౌట్​ కావడం అభిమానులను నిరాశపరిచింది.

IPL 2021: CSK VS DC MATCH FIRST INNINGS
సురేశ్ రైనా
author img

By

Published : Apr 10, 2021, 9:13 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్ ధాటిగా ఆడింది. తొలి ఇన్నింగ్స్​లో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చాలా రోజుల తర్వాత మైదానంలో దిగిన సురేశ్ రైనా(54) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు చెన్నైకి ఓపెనర్లు షాకిచ్చారు. 7 పరుగుల స్కోరు వద్ద ఇద్దరూ ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రైనా ఆచితూచి ఆడగా, మొయిన్ అలీ నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్​కు చేరాడు. అనంతరం రాయుడుతో కలిసి రైనా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి 23 పరుగులు చేసిన రాయుడు, 54 పరుగులు చేసిన రైనా ఔటయ్యారు.

ఖాతా తెరవకుండానే ధోనీ నిష్క్రమణ

డకౌట్ అయిన కెప్టెన్ ధోనీ.. అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం రెండే బంతులు ఎదుర్కొని, సెల్ఫ్ ఔట్​గా వెనుదిరిగాడు. చివర్లో జడేజా(26), సామ్ కరన్(34) ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు.

దిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, అశ్విన్, టామ్ కరన్, వోక్స్ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.