ETV Bharat / sports

ఐపీఎల్:​ తొలి మ్యాచ్​లో ఆర్సీబీపై ముంబయి గెలిచేనా? - ఎంఐ vs ఆర్‌సీబీ మ్యాచ్ అప్‌డేట్స్

దాదాపు ప్రతి సీజన్​లో తొలి మ్యాచ్​లో ఓడిపోయే ముంబయి.. ఈసారి రూటు మార్చుకుంటుందా? లేదంటే దానిని కొనసాగిస్తుందా అనేది చూడాలి. ఆర్సీబీతో జరిగే ఈ పోరు.. సాయంత్రం 7:30 గంటలకు చెన్నైలో ప్రారంభం కానుంది.

Kohli and Rohit face-off in opener
ఐపీఎల్:​ తొలి మ్యాచ్​లో ఆర్సీబీపై ముంబయి గెలిచేనా?
author img

By

Published : Apr 9, 2021, 5:31 AM IST

ఐపీఎల్ వేడుకకు అంతా సిద్ధమైంది. నేటి(ఏప్రిల్ 9) నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్​.. ప్రేక్షకుల్లేకుండానే జరగనుంది. తొలి మ్యాచ్​లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మరి ఆ జట్ల గురించి విశేషాలు మీకోసం.

kohli rohit
కోహ్లీ-రోహిత్

ఐదు నెలల క్రితం యూఏఈలో జరిగిన ఐపీఎల్​లో విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ అదే ఉత్సాహంతో ఈ సీజన్​లోనూ బరిలోకి దిగుతోంది. ఆరోసారి కప్పు కొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, పొలార్ట్, ఇషాన్ కిషాన్​లతో బ్యాటింగ్ లైనప్​... కృనాల్ పాండ్య, బుమ్రా, బౌల్ట్​, రాహుల్ చాహుర్​లతో లోయర్​ ఆర్డర్​ బలంగానే ఉంది. అయితే ప్రతి సీజన్​లోనూ దాదాపు తొలి మ్యాచ్​ ఓడిపోయే ఈ జట్టు.. ఈసారి ఏం చేస్తుందో?

ఇప్పటివరకు ఒక్కసారైనా కప్పు సాధించలేకపోయిన బెంగళూరు జట్టు.. ప్రస్తుత సీజన్​లో దానిని అధిగమించాలనుకుంటోంది. ఈసారి కోహ్లీ, డివిలియర్స్​కు తోడుగా విధ్వంసక మ్యాక్స్​వెల్​ ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. మరోవైపు యువ బ్యాట్స్​మెన్ దేవ్​దత్ పడిక్కల్, మహమ్మద్ అజహరుద్దీన్​తో పాటు చాహల్, సిరాజ్, సైనీ తదితరులు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సీజన్​లో వీళ్లందరూ కలిసి ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి?

RCB KOHLI
ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ

జట్లు(అంచనా)

ముంబయి: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, జేమ్స్ నీషమ్, కౌల్టర్​నైల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా.

బెంగళూరు: కోహ్లీ(కెప్టెన్), దేవ్​దత్ పడిక్కల్, డివిలియర్స్, మ్యాక్స్​వెల్, అజహరుద్దీన్, ఫిన్ అలెన్, వాషింగ్టన్ సుందర్, సైనీ, చాహల్, సిరాజ్, రిచర్డ్​సన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.