ETV Bharat / sports

రాణించిన ఓపెనర్లు.. సన్​రైజర్స్​పై చెన్నై విజయం - హైదరాబాద్ vs చెన్నై

దిల్లీ వేదికగా హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సునాయాస విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ధోనీసేన. ప్రస్తుత విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

hyderabad vs chennai, david warner, dhoni
హైదరాాబాద్ vs చెన్నై, డేవిడ్ వార్నర్, ధోనీ
author img

By

Published : Apr 28, 2021, 10:58 PM IST

దిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియం వేదికగా హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే బ్యాట్స్​మెన్​లో ఓపెనర్లు రుతురాజ్​-డుప్లెసిస్.. హాఫ్ సెంచరీలతో రాణించారు. ఎస్​ఆర్​హెచ్​ బౌలర్లలో రషీద్ ఖాన్​ 3 వికెట్లు తీసుకున్నాడు.

172 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి వికెట్​కు 129 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది గైక్వాడ్​-డుప్లెసిస్ జోడీ. దాదాపు 10 రన్​రేట్​తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరి జోరు చూస్తే వికెట్​ కోల్పోకుండానే సీఎస్కే విజయాన్ని సాధిస్తుందా అని భావించారంతా. కానీ, అద్భుతమైన బంతితో రుతురాజ్ (44 బంతుల్లో 75 పరుగులు)​ను క్లీన్​ బౌల్డ్​ చేశాడు రషీద్​ ఖాన్​. సన్​రైజర్స్​కు తొలి వికెట్​ను అందించాడు. తర్వాత కాసేపటికే మొయిన్​ అలీతో పాటు డుప్లెసిస్​ (38 బంతుల్లో 56 పరుగులు)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు రషీద్​. అనంతరం బ్యాటింగ్​కు దిగిన రైనా-జడేజా మిగిలిన పని పూర్తి చేశారు. ​

ఇవీ చదవండి: ఐపీఎల్​లో వార్నర్ రికార్డు.. తొలి ఆటగాడిగా ఘనత

ఐఓఏ ఉపాధ్యక్షుడు జనార్ధన్ సింగ్ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.