ETV Bharat / sports

'వారికి సమాచారం మాత్రమే కావాలి.. ప్రయోజనాలు కాదు' - Aussie players looking for right information

భారత్​లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఐపీఎల్​ అనంతరం స్వదేశానికి తీసుకెళ్లే విషయమై.. క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్​ చీఫ్​ గ్రీన్​బెర్గ్​ తెలిపారు. క్రికెటర్లు కేవలం సమాచారాన్ని మాత్రమే కోరుతున్నారని.. ఎటువంటి ప్రయోజనాలు ఆశించట్లేదని ఆయన పేర్కొన్నారు.

Aussie players looking for right information not specific favours, says ACA chief
ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్​, టెడ్​ గ్రీన్​బర్గ్​
author img

By

Published : Apr 28, 2021, 5:36 PM IST

భారత్​ నుంచి ఆస్ట్రేలియాకు విమాన రాకపోకలు నిలిపివేయడంపై ఆస్ట్రేలియన్​ క్రికెట్ అసోసియేషన్​ చీఫ్​ టెడ్​ గ్రీన్​బెర్గ్​ స్పందించారు. ఐపీఎల్ అనంతరం ఆసీస్​ క్రికెటర్లు స్వదేశానికి తీసుకొచ్చే విషయంపై క్రికెట్​ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

"ఐపీఎల్​లో ఆడుతున్న మన ఆటగాళ్లు దేనిపై ఆశలు, అంచనాలు పెట్టుకోలేదు. వాళ్లు కోరుకునేది కేవలం సరైన సమాచారం. లీగ్​ అనంతరం ఛార్టర్డ్​ విమానాల్లో తీసుకెళ్తారా? లేదా? అనేది వారు తెలుసుకోవాలనుకుంటున్నారు. దాన్ని బట్టి వారు ఈ లీగ్​కు ప్రణాళిక​ వేసుకుంటారు. ఇందుకు సంబంధించి ఇటు క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఐపీఎల్​ నిర్వాహకులతోనూ చర్చలు జరుపుతున్నాం" అని గ్రీన్​బర్గ్​ తెలిపారు.

ఇదీ చదవండి: 'ప్రత్యేక ఏర్పాట్లు చేయండి- అదేం కుదరదు'

స్వదేశానికి ఎలా వెళ్లాలనే విషయంపై ఆందోళన చెందుతున్న విదేశీ క్రికెటర్లకు ఐపీఎల్​ సీఓఓ హేమంగ్ అమిన్​ స్పష్టత ఇచ్చారు. సజావుగా ఇళ్లను చేర్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి: 'మీరు సజావుగా వెళ్లాకే.. లీగ్​​ ముగిసినట్లు భావిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.