ETV Bharat / sports

టీ20ల్లో రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్! - cricket news

టీ20ల్లో భారత్ తరఫున ఘనత సాధించేందుకు అశ్విన్ సిద్ధమవుతున్నాడు. మరో వికెట్​ తీస్తే 250 వికెట్ల మార్క్​ను చేరుకుంటాడు.

IPL 2021: Ashwin one scalp away from 250 T20 wickets
టీ20ల్లో రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్!
author img

By

Published : Apr 15, 2021, 4:32 PM IST

సీనియర్ స్పిన్నర్, దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. టీ20ల్లో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. రాజస్థాన్​ రాయల్స్​తో గురువారం జరిగే మ్యాచ్​లో ఒక్క వికెట్​ తీస్తే.. పొట్టి ఫార్మాట్​లో 250 వికెట్లు మైలురాయిని అందుకున్న తొలి బౌలర్​గా నిలుస్తాడు. ఐపీఎల్ ఇప్పటివరకు 139 వికెట్లు తీసిన అశ్విన్.. టీమ్​ఇండియా తరఫున 52.. దేశవాళీ మ్యాచ్​ల్లో మిగిలిన వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్​లో ఎక్కువ వికెట్లు తీసిన వారిలో మలింగ (170) అగ్రస్థానంలో ఉన్నాడు. అమిత్ మిశ్రా(160), పియూష్ చావ్లా(156), డ్వేన్ బ్రావో(154), హర్భజన్ సింగ్(150).. తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మలింగ తప్ప మిగిలిన వారందరూ ఇప్పటికీ లీగ్​లో ఆడుతున్నారు.

ఈ సీజన్​లోని తమ ప్రారంభ మ్యాచ్​లో చెన్నైని ఓడించిన దిల్లీ క్యాపిటల్స్​.. అదే ఉత్సాహంతో రాజస్థాన్​ రాయల్స్​తో పోరుకు సిద్ధమవుతోంది. సాయంత్రం 7:30 గంటలకు ముంబయి వేదికగా ఈ పోరు జరగనుంది.

ఇది చదవండి: ఐపీఎల్​: దిల్లీపై రాజస్థాన్​ గెలుస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.