108 మ్యాచ్‌లు.. 125వికెట్లు స్పిన్నర్ చాహల్(Chahal) ఐపీఎల్ రికార్డ్. 2013లో ముంబయి ఇండియన్స్ తరఫున ఈ మెగాలీగ్‌లో(IPL) అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2014 నుంచి ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మణికట్టు మాంత్రికుడు తన కెరీర్ సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇందులో భాగంగా.. ఒకవేళ ఆర్సీబీ(RCB) కాకుండా ఇతర జట్టుకు ఆడాల్సి వస్తే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున ఆడటం తనకిష్టమని చెప్పాడు.
కెరీర్ బెస్ట్ మూమెంట్ ఏంటి?
2016లో టీమ్ఇండియా అరంగేట్రం చేయడం
కోహ్లీ, ధోనీ.. ఎవరు గొప్ప సారథి?
ఇద్దరు.
కోహ్లీ(Kohli) గురించి మూడు పదాల్లో
క్రమశిక్షణ, Passionate, కష్టపడేతత్వం
మీ బయోపిక్ తీస్తే మీ భార్య,భర్తల పాత్ర ఎవరు పోషించాలి?
రణ్‌దీప్ హుడా, కత్రినా కైఫ్
క్రిస్ గేల్, మీకు మధ్య ఆర్మ్ రెజ్లింగ్ (చేతులతో సాగే కుస్తీ ప్రదర్శన) పోటీ పెడితే ఎవరు గెలుస్తారు?
నేనే గెలుస్తా.
ఐపీఎల్లో ఆర్సీబీ కాకుండా ఏ జట్టుకు ఆడాలనుకుంటున్నారు?
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings).
ప్రస్తుత చెస్ ప్లేయర్స్‌లో ఎవరితో మ్యాచ్ ఆడాలనుకుంటున్నారు?
విశ్వనాథ్ ఆనంద్.
మాజీ బ్యాట్స్మెన్లలో ఎవరికి బౌలింగ్ చేయడమంటే ఇష్టం?
బ్రియన్ లారా సార్.
మీ దృష్టిలో భారత్ కాకుండా ఉత్తమ క్రికెట్ జట్టు ఏది?
న్యూజిలాండ్.
బాలీవుడ్ హీరోయిన్స్‌లో మీ క్రష్ ఎవరు?
కత్రినా కైఫ్(Katrina Kaif).
మీకు ధోనీ చెప్పిన గొప్ప సందేశం ఏంటి?
నీపై నీవు నమ్మకం ఉంచు, దృష్టి పెట్టి పనిచేయు
ఇష్టమైన హాలీడే డెస్టినేషన్?
గ్రీస్.
ఏ రికార్డును అందుకోవాలని ఇష్టపడతారు?
టెస్టు క్రికెట్లో ఐదు వికెట్లు తీయడం
ఇదీ చూడండి రోహిత్ వల్లే ఐపీఎల్ అరంగేట్రం చేశా: చాహల్