ETV Bharat / sports

IPL 2021 News: హర్షల్ పటేల్ అదిరిపోయే రికార్డు.. తొలి భారత బౌలర్​గా - హర్షల్ పటేల్ న్యూస్

ఐపీఎల్​లో సరికొత్త రికార్డు సృష్టించాడు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్(Harshal Patel IPL Wickets ). ఈ సీజన్​లో(IPL 2021) 32 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు.

harshal, bravo
హర్షల్, బ్రావో
author img

By

Published : Oct 12, 2021, 11:25 AM IST

రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌(Harshal Patel IPL Wickets ) ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్​లో(RCB vs KKR) రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా.. ఒకే సీజన్​లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా రికార్డు నెలకొల్పాడు. చెన్నై సూపర్​ కింగ్స్​ ఆల్​రౌండర్ బ్రావో(Bravo record in IPL) 2013లో 32 వికెట్లు తీసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ప్రస్తుతం హర్షల్ 32 వికెట్లతో బ్రావోకు సమంగా నిలిచాడు.

2020లో ముంబయి ఇండియన్స్‌ ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా 27 వికెట్లతో చెలరేగి ఇదివరకు ఆ రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు బెంగళూరు పేసర్‌ హర్షల్ దీనిని తిరగరాశాడు. లీగ్‌ దశలో కోహ్లీసేన తమ చివరి మ్యాచ్‌లో దిల్లీపై గెలవకముందు సన్‌రైజర్స్‌తో ఓ మ్యాచ్‌ ఆడి ఓటమిపాలైంది. అందులో హర్షల్‌ మూడు వికెట్లు తీసి బుమ్రా రికార్డును అధిగమించాడు. అలాగే జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఈ బెంగళూరు పేసర్‌ మరో రికార్డు సృష్టించాడు.

ఇప్పటివరకూ ఐపీఎల్​లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితా..

  • హర్షల్(2021)-32
  • బ్రావో(2013)-32
  • రబాడా(2020)-30
  • మలింగ(2011)-28
  • ఫాల్కనర్(2013)-28
  • బుమ్రా(2020)-27

ఇదీ చదవండి:

'ఆ ఒక్క ఓవరే మా అవకాశాలను దెబ్బతీసింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.