ETV Bharat / sports

హార్దిక్​ పాండ్యాకు మళ్లీ ఏమైంది? బౌలింగ్​ చేస్తూ ఒక్కసారిగా.. - గుజరాత్​ టైటాన్స్​

Hardik Pandya Injury: ఐపీఎల్​ 2022 సీజన్​లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తూ పాయింట్ల టేబుల్​లో అగ్రస్థానంలో ఉంది. అయితే ఆ టీం సారథి హర్దిక్​ పాండ్యాను గాయాల బెడద ఇంకా వెంటాడుతోంది. రాజస్థాన్​తో గత రాత్రి జరిగిన మ్యాచ్​లో బౌలింగ్​ చేస్తూ మధ్యలోనే వైదొలిగాడు.

HARDIK PANDYA Injury
HARDIK PANDYA Injury
author img

By

Published : Apr 15, 2022, 9:57 AM IST

Hardik Pandya Injury: ఐపీఎల్​ 2022లో కొత్త జట్టు గుజరాత్​ టైటాన్స్​ అదరగొడుతోంది. గత రాత్రి రాజస్థాన్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో​ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​లో బ్యాట్​తో అదరగొట్టిన హార్దిక్‌ పాండ్య గుజరాత్‌కు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత మెరుపు ఫీల్డింగ్‌తో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ను రనౌట్‌ చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గాయం భయం మాత్రం అతడిని ఇంకా వెంటాడుతోంది.

రాజస్థాన్‌ బ్యాటింగ్​ సమయంలో.. 19వ ఓవర్‌ వేసేందుకు వచ్చిన హార్దిక్‌ కోటా పూర్తి చేయలేకపోయాడు. తొడకండరాల సమస్యతో కేవలం మూడు బంతులే వేసి మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్‌ను విజయ్‌ శంకర్‌ పూర్తి చేశాడు. అయితే గాయాలు, ఫిట్​నెస్​లేమితో.. హార్దిక్‌ చాలా కాలంగా టీమ్​ఇండియాకు ఆడట్లేదు. ఇప్పుడు ఐపీఎల్​లో మళ్లీ ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. మ్యాచ్​ అనంతరం స్పందించిన హార్దిక్​ "అది చిన్న నొప్పి మాత్రమే, తీవ్రమైన గాయం ఏం కాదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.

టీ20 మెగా టోర్నీలో భాగంగా నిన్న(గురువారం) జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థి జట్టు రాజస్థాన్​కు 193 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఇక బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్​ జట్టు 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి ఓటమిపాలైంది. బ్యాటింగ్​, బౌలింగ్​తో అద్భుతంగా రాణించిన గుజరాత్​ జట్టు విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (87; 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో సత్తా చాటాడు. అభినవ్ మనోహర్ (43; 28 బంతుల్లో 4×4, 2×6), డేవిడ్ మిల్లర్‌ (31; 14 బంతుల్లో 5×4, 1×6) ధాటిగా ఆడారు. ఇక బౌలింగ్​లో కూడా లాకీ ఫెర్గూసన్‌, యశ్ దయాల్ మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమి, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్ తీసి అదరగొట్టారు. గుజరాత్ జట్టు​ తన తదుపరి మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం పుణెలో తలపడనుంది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.