ETV Bharat / sports

ఈ రికార్డుల రారాజుకు తీరని కల అదొక్కటే!

author img

By

Published : Apr 30, 2021, 5:34 AM IST

క్రికెట్​లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్​ రోహిత్ శర్మ.. నేడు 34వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా క్రికెట్​లో హిట్​మ్యాన్​ నెలకొల్పిన రికార్డులేవో.. వాటి విశేషాల గురించి తెలుసుకుందాం.

Happy Birthday Rohit Sharma
రోహిత్ శర్మ

టీమిండియాకు సచిన్​, సెహ్వాగ్​ వంటి దిగ్గజాలు.. ఓపెనర్లుగా ఏళ్లపాటు సేవలందించారు. వారిద్దరూ రిటైర్మెంట్​కు దగ్గర పడుతున్న సమయంలో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలా? అని ఆలోచిస్తున్న మేనేజ్​మెంట్​కు కరెక్ట్​గా దొరికాడు రోహిత్ శర్మ. 2013 ఛాంపియన్స్​ ట్రోఫీలో ఓపెనర్​గా ప్రారంభమైన తన కొత్త ప్రయాణంతో, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడి, హిట్​మ్యాన్​గా పేరు తెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల జట్టుకు వైస్​కెప్టెన్​గానూ బాధ్యతలు అందుకున్నాడు. హిట్​మ్యాన్​ నేడు 34వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడి గురించి ప్రత్యేక కథనం.

డబుల్​ సెంచరీల ట్రిపుల్ ధమాకా

వన్డే క్రికెట్​లో చాలా కొద్దిమందికే సాధ్యమైన డబుల్ సెంచరీని రోహిత్ శర్మ.. ఇప్పటికే మూడుసార్లు సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో నాలుగు శతకాలు బాదాడు. టెస్టుల్లోనూ ఓపెనర్​గా వచ్చిన తొలిమ్యాచ్​ రెండు ఇన్నింగ్స్​ల్లోనూ సెంచరీలు చేసిన ఒకే ఒక్క క్రికెటర్ హిట్​మ్యాన్​ కావడం విశేషం.

Happy Birthday Rohit Sharma
రోహిత్ శర్మ

2007లో జాతీయ జట్టులోకి వచ్చిన రోహిత్... అదే ఏడాది టీ20 ప్రపంచకప్​ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఫామ్​ లేమి కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో 2011 వన్డే ప్రపంచకప్​లో ఆడే అవకాశం దక్కలేదు. అనంతరం బ్యాటింగ్​లో పలు రికార్డులతో హిట్​మ్యాన్​గా పేరు తెచ్చుకున్నా, వన్డే ప్రపంచకప్​ను అందుకోవాలనేది మాత్రం అతడికి ఇంకా కలగానే మిగిలిపోయింది.

హిట్​మ్యాన్ ఘనతలు

  1. వన్డేల్లో అత్యధిక స్కోరు రోహిత్ పేరిట ఉంది. శ్రీలంకపై మ్యాచ్​లో (264 పరుగులు) ఈ ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్​లో మూడు డబుల్స్​చేసిన ఏకైక క్రికెటర్ ఇతడే.
  2. ఒకే ప్రపంచకప్​లో(2019) ఐదు శతకాలు చేసిన బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ.
  3. ప్రపంచకప్​లో ఛేదనలో అత్యధిక సెంచరీలు(3) చేసిన బ్యాట్స్​మన్ రోహిత్.
  4. ఇంగ్లాండ్ గడ్డపై హ్యాట్రిక్ శతకాల రికార్డు రోహిత్ పేరిట ఉంది. ఇది 2019 ప్రపంచకప్​లో నమోదైంది.
  5. టెస్టుల్లో ఓపెనర్​గా వచ్చిన తొలి మ్యాచ్​లోని రెండు ఇన్నింగ్స్​ల్లోనూ శతకాలు నమోదు చేసిన తొలి క్రికెటర్ రోహిత్.
    Happy Birthday Rohit Sharma
    రోహిత్ శర్మ
  6. 2013-19 మధ్య కాలంలో ప్రతి క్యాలెండర్​ ఏడాదిలోనూ 50 సగటుతో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు రోహిత్. మరే క్రికెటర్ కూడా ఇలా వరుసగా ఏడేళ్లపాటు ఈ ఫీట్ సాధించలేదు.
  7. ఒక్క 2019లోనే 10 శతకాలు బాదాడు రోహిత్ శర్మ. అదేవిధంగా ఒకే క్యాలెండర్ ఏడాదిలో 7 జట్లపై సెంచరీలు చేసిన మొదటి క్రికెటర్ రోహిత్.
  8. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఓపెనర్ రోహిత్ శర్మ.
  9. సిక్సర్‌తో అన్ని ఫార్మాట్లలో శతకం సాధించిన ఏకైక క్రికెటర్. వన్డేల్లో 3, టెస్టుల్లో 2, టీ20ల్లో ఓ శతకాన్ని సిక్స్‌ కొట్టి నమోదుచేశాడు.
  10. 10 దేశాల్లో ఓ ఇన్నింగ్​లో 50 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్​మన్ రోహిత్. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, అమెరికాల్లో ఈ ఫీట్ సాధించాడు.
  11. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​కు కెప్టెన్సీ వహిస్తూ, ఐదుసార్లు కప్పును అందుకున్నాడు రోహిత్ శర్మ.

ఇదీ చూడండి.. ఐపీఎల్: అయ్య బాబోయ్.. మేం ఆడలేం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.