Ipl 2022 Hardik Pandya: కొత్త కుర్రాళ్లతో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గుజారాత్.. ఐదో మ్యాచ్‌లో తొలి గెలుపు రుచి చూసిన చెన్నై జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుని జడేజా నాయకత్వంలోని చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరి గుజరాత్ అగ్రస్థానం నిలబెట్టుకుంటుందో.. చెన్నై తొలి విజయం ఊపును కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్ వ్యవహరించనున్నాడు. హార్దిక్ పాండ్య గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది.
గురువారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ సమయంలో.. 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన హార్దిక్ కోటా పూర్తి చేయలేకపోయాడు. తొడకండరాల సమస్యతో కేవలం మూడు బంతులే వేసి మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్‌ను విజయ్ శంకర్ పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్‌కు కూడా హార్దిక్ పాండ్య దూరం అయినందున అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌కోసం జట్టులో కొన్ని మార్పులు చేసింది. వృద్ధిమాన్ సాహా , అల్జారీ జోసెఫ్ జట్టులోకి తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారో చూడాలి.
ఇవీ చదవండి: సన్‌రైజర్స్ జైత్రయాత్ర.. పంజాబ్‌పై ఘన విజయం