ETV Bharat / sports

IPL 2023 : గుజరాత్​కు బిగ్​ షాక్​.. సీజన్​ మొత్తానికి కేన్​ మామ దూరం!

author img

By

Published : Apr 1, 2023, 1:30 PM IST

మొదటి మ్యాచ్​ను గెలుపొందిన ఆనందంలో ఉన్న ఐపీఎల్​ టీమ్​ గుజరాత్‌ టైటాన్స్‌కు ఓ గట్టి షాక్​ తగిలే అవకాశాలున్నాయి. శుక్రవారం సీఎస్​కేతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌.. ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

kane willamson
kane willamson

ఐపీఎల్‌-2023 మొదటి మ్యాచ్​ను గెలుపొందిన ఆనందంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌కు ఓ గట్టి షాక్​ తగిలే అవకాశం ఉంది. శుక్రవారం సీఎస్​కేతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన గుజరాత్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌.. ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అసలు ఏం జరిగింది?
శుక్రవారం సాయంత్రం జరిగిన సీఎస్‌కే ఇన్నింగ్స్ 13వ ఓవర్​లో గుజరాత్​ ప్లేయర్​ జోషువా లిటిల్ వేసిన బంతిని చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డీప్ స్క్వేర్​ లెగ్ దిశగా ఆడాడు. దీంతో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కేన్​ విలియమ్సన్‌.. గాల్లోకి ఎగిరి ఆ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే తను బ్యాలెన్స్‌ తప్పానని తెలుసుకున్న కేన్‌.. బంతిని మైదానంలోకి విసిరి తన జట్టుకు రెండు పరుగులను సేవ్‌ చేశాడు.

అలా బంతిని ఆపే క్రమంలో అతడి మోకాలు నేలకు బలంగా తాకింది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్​మెంట్​.. మైదానంలోకి ఫిజియోను తీసుకొచ్చి చికిత్స అందించారు. అయినప్పటికీ అతడి నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఇక నొప్పితో తల్లడిల్లిపోతున్న కేన్​ను హుటాహుటిన మైదానంలో నుంచి పెవిలియన్​కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ బ్యాటింగ్​కు దిగాడు. అయితే ఇప్పటి వరకు విలియమ్సన్‌ గాయం గురించి గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానీ మ్యాచ్‌ తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ మీడియాతో మాట్లాడారు. "విలియమ్సన్‌ మోకాలికి తీవ్ర గాయమైంది. అతడిని మా ఫిజియో స్పెషలిస్టులు పరిశీలిస్తున్నారు. మేము అతడిని స్కానింగ్‌కు కూడా పంపించాము" అని తెలిపారు. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే కేన్‌ ఐపీఎల్‌ మొత్తానికి దూరం కానున్నట్లు అనిపిస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ కూడా కేన్‌ గాయంపై స్పందించారు. అతడికి తీవ్ర గాయమైనట్లు స్టెడ్‌ తెలిపారు. ఈ గాయం వల్ల జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని అని స్టెడ్‌ పేర్కొన్నారు.

తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానం..
ఐపీఎల్‌ సీజన్‌ 16 ప్రారంభానికి ముందే చర్చకు కారణమైన 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' విధానం తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి వచ్చింది. మ్యాచ్​కు తొలి ఇంపాక్ట్​ ప్లేయర్​గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు తుషార్‌ దేశ్‌పాండే నిలిచాడు. చెన్నై బ్యాటింగ్‌ తర్వాత గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందు అంబటి రాయుడు స్థానంలో తుషార్‌ మైదానంలోకి వచ్చాడు.

ఇక ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే తన బౌలింగ్‌ దాడి మొదలెట్టి ప్రత్యర్థులను హడలెత్తించాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో రాయుడు 12 పరుగులు చేశాడు. మరోవైపు గుజరాత్‌ కూడా ఈ మ్యాచ్‌లోనే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానాన్ని వాడుకుంది. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ విలియమ్సన్‌ స్థానంలో.. జట్టు సభ్యుడు సాయి సుదర్శన్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకుంది. సాహా ఔటైన తర్వాత సాయి సుదర్శన్​ క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.