ETV Bharat / sports

Maxwell IPL: 'చెత్తగా వాగొద్దు.. మేమూ మనుషులమే'

సోషల్​ మీడియాలో వస్తున్న ట్రోల్స్​పై స్పందించాడు రాయల్​ ఛాలెంజర్స్​ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్(Maxwell IPL). కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ట్విట్టర్​ పోస్ట్​లో తెలిపాడు. 'మేమూ మనుషులమే.. ప్రతిరోజు మా అత్యున్నత ఆటతీరు ప్రదర్శించేందుకే మేం ప్రయత్నిస్తున్నాం' అని భావోద్వేగ ట్వీట్ చేశాడు.

maxwell
మ్యాక్స్​వెల్
author img

By

Published : Oct 12, 2021, 1:19 PM IST

సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు చెత్తగా వాగుతున్నారని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్(Maxwell IPL) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకరమైన విషయమని చెప్పిన అతడు(Maxwell News), 'మేమూ మనుషులమే కదా' అంటూ ట్విట్టర్​లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. తనను, తన జట్టు సభ్యులను విమర్శిస్తున్న వారిపై మండిపడ్డాడు.

"ప్రతిరోజు మా అత్యుత్తమ స్థాయిని కనబరిచేందుకు మేం ప్రయత్నిస్తుంటాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు హుందాగా ఉండేందుకు మీరూ ప్రయత్నించండి" అని తనపై విమర్శలు గుప్పిస్తున్నవారికి కౌంటర్​ ఇచ్చాడు మ్యాక్స్​వెల్(Maxwell News IPL). ఆర్సీబీకి అండగా నిలిచిన నిజమైన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

"ఆర్సీబీకి ఇదో గొప్ప సీజన్. కానీ, దురదృష్టవశాత్తు ఫైనల్​ చేరుకునే అవకాశం కోల్పోయాం. సోషల్​ మీడియాలో చాలామంది చెత్తగా వాగుతున్నారు. ఇది చాలా బాధాకరం. వాళ్లలా ఉండకండి."

-గ్లెన్ మ్యాక్స్​వెల్, ఆల్​రౌండర్.

సోమవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ(RCB vs KKR 2021) ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో.. కొంతమంది నెటిజన్లు మ్యాక్స్​వెల్, డేనియల్ క్రిస్టియన్​పై తీవ్ర విమర్శలు చేస్తూ పోస్టులు చేశారు. ఈ సందర్భంగా మ్యాక్స్​వెల్​ పోస్ట్​కు ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ ఏడాది ఆర్సీబీ తరఫున ఆడిన మ్యాక్స్​వెల్​ 513 పరుగులతో బాగా రాణించాడు. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి:

IPL Eliminator 2021:బెంగళూరుపై కోల్​కతా విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.