ఐపీఎల్లో (IPL 2021 News) చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ధోనీ (Dhoni CSK Captain) సారథ్యంలో ఇప్పటికే ఆ జట్టు (CSK IPL Titles) మూడు సార్లు ట్రోఫీ గెలిచింది. డుప్లెసిస్, రైనా, జడేజా లాంటి స్టార్ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అభిమానులను విశేషంగా అలరిస్తున్నారు. అప్పుడప్పుడు సీఎస్కే మ్యాచ్ చూడటానికి వచ్చే ఈ క్రికెటర్ల భార్యలకూ సామాజిక మాధ్యమాల్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. మరి అందంలో మోడళ్లకు ఏమాత్రం తగ్గని ఈ సీఎస్కే క్రికెటర్ల భార్యలు (CSK Players Wives) ఎవరో చూడండి.
ధోనీ- సాక్షి
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_13.jpg)
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షిల (MS Dhoni Wife) ప్రేమ కథ 'ఎం.ఎస్ ధోనీ' సినిమా ద్వారా అందరికీ పరిచయమైంది. 2014లో వీరికి వివాహం జరిగింది. జీవా అనే కూతురు కూడా ఉంది. చాలా సందర్భాల్లో భారత్, సీఎస్కే మ్యాచ్‌లకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది సాక్షి.
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_12.jpg)
జడేజా-రీవా
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_10.jpg)
ఓ స్నేహితుడి పార్టీలో కలుసుకున్నారు టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రీవా సోలంకి (Jadeja Wife). కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. 2016లో పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే వారికి నిధ్యాన అనే కూతురు పుట్టింది.
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_11.jpg)
రైనా- ప్రియాంక
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_9.jpg)
టీమ్ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా, ప్రియాంక (Raina Wife).. చిన్ననాటి స్నేహితులు. వారికి 2015లో పెళ్లి అయ్యింది. గ్రేసియా, రియో అనే ఇద్దరు పిల్లలున్నారు.
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_8.jpg)
రాయుడు- విద్య
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_7.jpg)
కళాశాల రోజుల నుంచి ప్రేమిస్తున్న విద్య (Rayudu Wife) అనే అమ్మాయితో 2009లో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు అంబటి రాయుడు. మీడియాకు దూరంగా ఉండే విద్య.. సీఎస్కే మ్యాచ్‌లు చూడటానికి వస్తుంటుంది.
డుప్లెసిస్- ఇమారి
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_6.jpg)
చాలా ఏళ్ల ప్రేమ తర్వాత 2013లో తన గర్ల్‌ఫ్రెండ్ ఇమారి విసెర్ను (Faf Du plessis Wife) పెళ్లి చేసుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డుప్లెసిస్. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలున్నారు.
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_5.jpg)
ఉతప్ప- శీతల్
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_3.jpg)
తన ప్రేయసి శీతల్ గౌతమ్‌ను (Uthappa Wife) 2016లో వివాహమాడాడు రాబిన్ ఉతప్ప. విశేషమేమిటంటే ఆమె మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. 2017లో వీరికి ఓ అబ్బాయి జన్మించాడు.
పుజారా-పూజ
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_2.jpg)
టీమ్ఇండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాది పెద్దలు నిశ్చయించిన వివాహం. పూజా పబరీని (Pujara Wife) 2013లో పెళ్లి చేసుకున్నాడు పుజారా. వారికి అదితి అనే కూతురు ఉంది.
![csk players wives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13146642_1.jpg)
ఇదీ చూడండి: Kohli News: మెంటార్‌గా 'ధోనీ'.. ఈసారైనా 'కోహ్లీ' లక్కు మారేనా?