ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించాడు. ఆ జట్టుకు 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా ఘనత వహించాడు. మొత్తంగా ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడాడు మహీ. నేడు పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్ 200వది. రైనా 190 మ్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.
-
7⃣ PM! Our heartbeat going 💛 "thala thala" 200*#Thala200 #PBKSvCSK #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/EKk75Xr0f0
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">7⃣ PM! Our heartbeat going 💛 "thala thala" 200*#Thala200 #PBKSvCSK #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/EKk75Xr0f0
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 16, 20217⃣ PM! Our heartbeat going 💛 "thala thala" 200*#Thala200 #PBKSvCSK #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/EKk75Xr0f0
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 16, 2021
ఇప్పటివరకు ఛాంపియన్స్ లీగ్‌లో సీఎస్కే తరఫున 24 మ్యాచ్‌లు ఆడిన ధోనీకి ఐపీఎల్లో ఇది 176వ మ్యాచ్. అలాగే మొత్తంగా లీగ్‌లో మహీకి ఇది 206వ మ్యాచ్. 2016, 17 సీజన్లలో సీఎస్కే నిషేధం ఎదుర్కొన్న సమయంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు 30 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడీ టీమ్ఇండియా మాజీ సారథి.
అలాగే చెన్నైకి కెప్టెన్‌గా ధోనీకి ఇది 199వ మ్యాచ్. ఐపీఎల్ ప్రారంభమైన 2008 సీజన్ నుంచి సీఎస్కే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు ధోనీ. కానీ ఒక్క మ్యాచ్‌లో మాత్రం రైనా సారథ్యం వహించాడు. 2012 ఛాంపియన్స్ లీగ్‌లో ఓ మ్యాచ్‌కు రైనా కెప్టెన్‌గా వ్యవహరించాడు.