ETV Bharat / sports

IPL 2023: ధోనీ అదిరిపోయే రికార్డు.. 'మాస్టారు మా మనసును గెలిచారు!' - అప్డేట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. లీగ్​ చరిత్రలో 200 వికెట్లలో భాగమైన తొలి వికెట్‌ కీపర్‌గా ధోనీ రికార్డుకెక్కాడు. మరోవైపు, మ్యాచ్​ అనంతరం జరిగిన రెండు ఆసక్తికర దృశ్యాలకు సంబంధించిన వీడియోలు మీకోసం!

dhoni
dhoni
author img

By

Published : Apr 22, 2023, 12:03 PM IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. లీగ్​ చరిత్రలో 200 వికెట్లలో భాగమైన తొలి వికెట్‌ కీపర్‌గా ధోనీ రికార్డులకెక్కాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌తో పాటు రనౌట్‌, స్టంపింగ్‌తో మెరిసిన ధోనీ.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో మహీ 137 క్యాచ్‌లు, 40 స్టంపింగ్‌లు, 23 రనౌట్‌లను చేశాడు. ధోనీ తర్వాతి స్థానాల్లో దినేశ్​ కార్తీక్ (187), ఏబీ డివిలియర్స్ (140) ఉన్నారు.

ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ధోనీ తొలి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్ డికాక్‌ రికార్డును ధోనీ బ్రేక్‌ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో ధోనీ.. 208 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. డికాక్‌ (207), దినేశ్‌ కార్తీక్‌ (205), కమ్రాన్‌ అక్మల్‌(172) తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు.

యువ ఆటగాళ్లకు ధోనీ క్లాస్​!
సన్​రైజర్స్​తో మ్యాచ్ అనంతరం​ హైదరాబాద్ యువ ఆటగాళ్లతో ధోనీ ప్రత్యేకంగా మాట్లాడాడు. తన అనుభవాలను పంచుకోవడంతో పాటు కొన్ని సలహాలు, సూచనలను యువ ఆటగాళ్లకు ఇచ్చాడు. ధోనీ క్లాస్‌ను సన్‌రైజర్స్ ఆటగాళ్లు చాలా శ్రద్ధగా విన్నారు. సన్‌రైజర్స్ పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, సన్విర్ సింగ్, కార్తీక్ త్యాగీ‌తో పాటు ఇతర సన్‌రైజర్స్ యువ ఆటగాళ్లు ధోనీతో ముచ్చటించారు. అతడితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ధోనీ క్లాస్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

'మాస్టారు మాస్టారు.. మా మనసును గెలిచారు'అని అభిమానులు ధోనీని కొనియాడుతున్నారు. ఇక ధోనీ ఇలా యువ ఆటగాళ్లతో మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గత రెండు సీజన్లుగా మ్యాచ్‌లు ముగిసిన వెంటనే అతడి చుట్టూ యువ ఆటగాళ్లు చేరడం.. ధోనీ తన అనుభవాలను పంచుకోవడంతో పాటు పలు సూచనలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ధోనీనే కాదు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఇలానే యువ ఆటగాళ్లతో మాట్లాడుతున్నారు.

ధోనీకి నటరాజన్​ కూతురు షాక్​!
అయితే మ్యాచ్ అనంతరం మైదానంలో ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఈ దృశ్యంలో ధోనీ ఉన్నప్పటికీ హైలెట్ అయ్యింది మాత్రం హైదరాబాద్​ ప్లేయర్ నటరాజన్ కుతురు హన్విక అనే చెప్పాలి. మ్యాచ్ ముగిశాక అందరిని కలుస్తూ.. నటరాజన్ దగ్గరికి వచ్చాడు ధోనీ. అక్కడే నటరాజన్ కుతురిని ఎత్తుకుని భార్యతో కలిసి ఉన్నాడు. ధోనీ వచ్చి నటరాజన్ కూతురికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ హన్విక మాత్రం తన చేతిని ఇవ్వలేదు. దాంతో హై ఫైవ్ అంటూ చేతిని చూపాడు.. ఈసారి బుడ్డది ఏకంగా తన చేతులను వెనక్కి లాక్కుంది. దాంతో నవ్వులు చిందించాడు ధోనీ.

ఆ తర్వాత ఈ పాప తంబి అని, మామ అని ధోనీని పిలిచింది. పాప మెుహం వెరీ షైనింగ్ అంటూ నటరాజన్​తో చెప్పాడు మహీ. అనంతరం అందరు కలిసి ఓ ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ధోని చిన్న పిల్లల మనస్తత్వం గలవాడని ప్రశంసిస్తున్నారు.

ఇక.. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై ఏడు వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. చెన్నై ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 77 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.