ETV Bharat / sports

అగ్రస్థానం కోసం దిల్లీ.. విజయాల్లో నిలకడ కోసం పంజాబ్​ - దిల్లీ vs పంజాబ్ మ్యాచ్​ ప్రివ్యూ

ఐపీఎల్​లో నేడు జరగాల్సిన రెండో మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​-పంజాబ్ కింగ్స్​ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్​ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ రాత్రి 7.30 గంటలకు​ ప్రారంభం కానుంది.

delhi capitals vs punjab kings, kl rahul, pant
దిల్లీ క్యాపిటల్స్​ vs పంజాబ్ కింగ్స్, కేెఎల్ రాహుల్, పంత్
author img

By

Published : May 2, 2021, 1:18 PM IST

ఐపీఎల్​లో ఆదివారం మరో రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్​, పంజాబ్​ కింగ్స్​ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్​లో ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. తొలి మ్యాచ్​లో పంజాబ్​ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని దిల్లీ అలవోకగా ఛేదించింది. ఇరుజట్లు ఇప్పటికే ఏడేసి మ్యాచ్​లాడగా.. దిల్లీ జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మూడు విజయాలు సాధించిన పంజాబ్​ ఐదో స్థానంలో నిలిచింది.

జోరు కొనసాగేనా?

కోల్​కతాతో జరిగిన గత మ్యాచ్​లో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది పంత్​ సేన. ఈ సీజన్​లో కేవలం రెండు ఓటములతో ఉన్న దిల్లీ.. ప్రతి మ్యాచ్​లోనూ ఆల్​రౌండ్​ ప్రదర్శన చేస్తూ వస్తోంది. బ్యాటింగ్​లో ఓపెనర్లు పృథ్వీ షాతో పాటు శిఖర్​ ధావన్​ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మిడిల్​ ఆర్డర్​లో కెప్టెన్ పంత్​తో పాటు స్టోయినిస్, హెట్మెయర్​ బ్యాటింగ్​లో రాణిస్తున్నారు.

మరోవైపు బౌలింగ్​లో పేసర్​ అవేశ్​ ఖాన్​ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. టోర్నీలో అత్యధిక వికెట్ల పడగొట్టిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. రబాడా, ఇషాంత్​, అక్షర్​ పటేల్, లలిత్​ యాదవ్​ బౌలింగ్​లో రాణిస్తున్నారు. ఈ మ్యాచ్​లో గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని దిల్లీ క్యాపిటల్స్​ వ్యూహాలను రచిస్తోంది.

పంజాబ్​కు ఎదురుందా?

రాయల్​ ఛాలెంజర్స్​తో ఆడిన చివరి మ్యాచ్​లో పంజాబ్ ఆల్​రౌండ్ ప్రదర్శన చేసింది. బ్యాటింగ్​లో 91 పరుగులతో అజేయంగా నిలిచిన రాహుల్.. కెప్టెన్​ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన హర్​ప్రీత్​ బ్రార్​ మూడు కీలక వికెట్లతో పాటు బ్యాటింగ్​లో 25 పరుగులు చేసి మ్యాచ్​ టర్నింగ్​ పాయింట్​గా నిలిచాడు. రవి బిష్ణోయ్(రెండు వికెట్లు)​ రూపంలో పంజాబ్​ జట్టుకు మంచి సహకారం లభించింది.

బ్యాటింగ్​లో సారథి రాహుల్​తో పాటు క్రిస్ గేల్​, దీపక్ హుడా​ రాణిస్తున్నారు. పంజాబ్ మిడిలార్డర్​ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. ఇక బౌలింగ్​లో మెరిడిత్, షమీ, జోర్డాన్​ రాణిస్తున్నప్పటికీ.. ఎక్కువ పరుగులు ప్రత్యర్థికి సమర్పిస్తున్నారు. ఆర్సీబీపై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న పంజాబ్​ జట్టు ఈ మ్యాచ్​ల ో కచ్చితంగా గెలవాలని సన్నహాలు చేస్తోంది.

తుదిజట్లు(అంచనా)..

దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్​ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్​ కీపర్​), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మేయిర్, ఆక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేశ్​ ఖాన్.

పంజాబ్ కింగ్స్​: రాహుల్ (కెప్టెన్), ప్రభుసిమ్రాన్​, గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, మెరిడిత్, హర్​ప్రీత్ బ్రార్.

ఇదీ చదవండి: కరోనా వారియర్స్ గౌరవార్థం కొత్త జెర్సీలో ఆర్సీబీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.