చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ తన ప్రేయసి(deepak chahar girlfriend)కి లవ్ ప్రపోజ్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్(csk vs pbks 2021) సమయంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఓవైపు చెన్నై జట్టు ఆటగాళ్లు, అభిమానులు ఓటమి బాధలో ఉంటే.. అకస్మాత్తుగా తన లేడీ లవ్‌కు మోకాలిపై కూర్చుని ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు చాహర్. తాజాగా ఈ విషయంపై స్పందించిన దీపక్ వాళ్ల నాన్న లోకేంద్ర సింగ్ చాహర్.. ఈ తతంగానికి అంతటికీ కారణం ధోనీ అని తెలిపారు.
"తన ప్రేయసికి దీపక్ కొద్దిరోజుల తర్వాత ప్రపోజ్ చేద్దామని అనుకున్నాడు. ప్లే ఆఫ్స్ సమయంలో ఇది జరగాల్సింది. కానీ ధోనీ చెప్పడం వల్ల లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ సమయంలో ప్రపోజ్ చేశాడు చాహర్. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 180 దేశాలు ఈ సన్నివేశాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా చూశాయి. దీపక్, జయ యూఏఈ నుంచి ఇంటికొచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తాం."
-లోకేంద్ర చాహర్, దీపక్ చాహర్ తండ్రి
ఏం జరిగింది?
పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తయిన సీఎస్కే ఆటగాళ్లు ఓటమి బాధలో మునిగిపోగా.. ఆ జట్టు పేసర్ దీపక్ చాహర్ మాత్రమే సంతోషంలో తేలిపోయాడు. మ్యాచ్ తర్వాత ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ గదుల్లోకి వెళ్లగా.. దీపక్ మాత్రం స్టాండ్స్‌లోకి వచ్చాడు. తన గర్ల్‌ఫ్రెండ్ జయ భరద్వాజ్‌తో కాసేపు మాట్లాడిన అతను.. పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఊహించని ఈ పరిణామానికి ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయిన జయ.. తన అంగీకారాన్ని తెలిపింది. దీపక్‌ను హత్తుకుని ముద్దులు పెట్టింది. ఆ తర్వాత ఈ ఇద్దరు స్టాండ్స్‌లోనే ఉంగరాలు మార్చుకున్నారు.
-
She said yesssss.! 💍
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations Cherry.! Stay Merry.! 😍🥳#WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/qVmvVSuI7A
">She said yesssss.! 💍
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 7, 2021
Congratulations Cherry.! Stay Merry.! 😍🥳#WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/qVmvVSuI7AShe said yesssss.! 💍
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 7, 2021
Congratulations Cherry.! Stay Merry.! 😍🥳#WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/qVmvVSuI7A