ETV Bharat / sports

వైరల్​గా మారిన వార్నర్​ షూస్​.. ఎందుకంటే? - David Warner shoes viral

ఈ ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ సారథి​ వార్నర్​ ధరించిన షూస్​కు సంబంధించిన ఫొటో​ వైరల్​గా మారింది. నెటిజన్లు దీని గురించి చర్చించుకుంటున్నారు. కారణం ఏమిటంటే?

David Warner
వార్నర్
author img

By

Published : Apr 29, 2021, 5:00 PM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​ సారథి వార్నర్​కు తన కుటంబం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ దొరికితే వారితో కలిసి ఎంతో సరదాగా గడుపుతూ దానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటాడు. ఇప్పుడు తన కుటుంబంపై ఉన్న ప్రేమను మరోసారి తెలియజేశాడు వార్నర్​. అభిమానులంతా దీని గురించే మాట్లాడుకునేలా చేశాడు.

ప్రస్తుతం వార్నర్​ ఐపీఎల్​లో ఆడుతున్నాడు. అయితే అతడు ధరించిన షూస్​ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే వాటిపై తన భార్య(క్యాండిస్​), ముగ్గురు కూతుర్ల పేర్లు(ఇవి, ఇండి, ఇస్లా) ఉండటమే దీనికి కారణం. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది. దీనిద్వారా అతడికి తన కుటుంబమంతే ఎంత ఇష్టమో మరోసారి తెలియజేశాడు.

గతంలో స్టార్​ ఫుట్​బాలర్​ డేవిడ్​ బెక్​హమ్​ దాదాపు పదేళ్ల క్రితం ఇదే తరహాలో తన పిల్లల పేర్లను షూస్​పై ముద్రించుకున్నాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫొటో తెగ వైరల్​ అయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.