ETV Bharat / sports

ఐపీఎల్​లో హైదరాబాద్​ బోణీ.. చెన్నై నాలుగో ఓటమి - abhishek sharma

CSK vs SRH: ఐపీఎల్​-2022లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తొలివిజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్​ కింగ్స్​పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

sunrisers hyderabad beat chennai super kings by wickets

author img

By

Published : Apr 9, 2022, 7:04 PM IST

CSK vs SRH: సమష్టి ప్రదర్శనతో సన్​రైజర్స్​ హైదరాబాద్​ అదరగొట్టింది. ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో బోణీ కొట్టి.. పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై సూపర్​ కింగ్స్​ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అభిషేక్​ శర్మ 50 బంతుల్లో 75 పరుగులతో రాణించాడు. విలియమ్సన్​ 40 బంతుల్లో 32 పరుగులతో.. శర్మకు చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో త్రిపాఠి 15 బంతుల్లో 39 రన్స్​తో చెలరేగాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్​ చౌదరి, డ్వేన్​ బ్రేవోకు చెరో వికెట్​ దక్కింది. మిగతా బౌలర్లంతా తేలిపోయారు. చెన్నైకి ఇది ఈ సీజిన్​లో వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.

తొలుత టాస్​ గెలిచిన సన్​రైజర్స్​ చెన్నైకి బ్యాటింగ్​ అప్పగించింది. ఆ జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. పవర్​ప్లేలోనే రాబిన్​ ఉతప్ప(15), రుతురాజ్​ గైక్వాడ్​(16) వికెట్లను కోల్పోయింది. ఫామ్​లో ఉన్న శివం దూబే(3), ధోనీ(3) విఫలమయ్యారు. ఈ మ్యాచ్​ కోసం రెండు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగాయి. చెన్నైలో ప్రిటోరియస్​ స్థానంలో మహేశ్​ తీక్షణ జట్టులోకి వచ్చాడు. సన్​రైజర్స్​లో సమద్​, షెఫర్డ్​ స్థానంలో శశాంక్​ సింగ్​, మార్కో జాన్సెన్​ ఆడారు.

ఇవీ చూడండి: ప్రతి 10 బంతులకో సిక్సర్​తో పాండ్య@4.. మరి టాప్​ ఎవరు?

సన్​రైజర్స్​ బౌలర్స్​ అదుర్స్​.. చెన్నై తక్కువ స్కోరుకే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.