ETV Bharat / sports

భారత్​కు క్రికెట్ ఆస్ట్రేలియా  విరాళం - క్రికెట్ ఆస్ట్రేలియా

కొవిడ్ రెండో దశ వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా భారతదేశానికి అండగా నిలవనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. సత్వర సాయంగా రూ.37 లక్షలను విరాళం ప్రకటించింది.

Cricket Australia,ో donates $50,000 to help India fight pandemic
క్రికెట్ ఆస్ట్రేలియా, భారత్​కు సాయం ప్రకటించిన సీఏ
author img

By

Published : May 3, 2021, 9:44 AM IST

కొవిడ్​తో పోరాడుతున్న భారతదేశానికి మద్దతు ప్రకటించింది క్రికెట్​ ఆస్ట్రేలియా. సత్వరమే రూ.37 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించింది. తమ దేశ ప్రజలు కూడా తమ వంతు సాయం చేయాలని కోరింది. దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న కరోనా రెండో దశపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

క్రికెట్​ ఆస్ట్రేలియాతో పాటు ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్​, యూనిసెఫ్​ ఆస్ట్రేలియాలు విరాళాల సేకరణకు ముందుకు వచ్చాయి. దేశంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు వైద్య పరికరాలు అందజేయనున్నట్లు యూనిసెఫ్ ఆస్ట్రేలియా తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: కరోనాతో బీసీసీఐ మాజీ సెలెక్టర్ మృతి

"క్రికెట్​పై ఉన్న ప్రేమ ఆస్ట్రేలియా, ఇండియా ప్రజల మధ్య మంచి బంధం ఏర్పర్చింది. కొవిడ్ ధాటికి భారతదేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది చాలా బాధాకరం. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే మా క్రికెటర్లు కమిన్స్​, బ్రెట్​ లీ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అదే స్ఫూర్తితో యూనిసెఫ్ ఆస్ట్రేలియాతో కలిసి విరాళాల సేకరణ చేపట్టలనుకుంటున్నాం. ఆక్సిజన్​ సరఫరా, వైద్య పరికరాలు, వ్యాక్సిన్ల తయారీకి ఈ నిధులను ఉపయోగించాలని కోరుతున్నాం."

-నిక్​ హాక్లీ, క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ.

ఇదీ చదవండి: 'వార్నర్​ ప్రపంచ స్థాయి ఆటగాడు​.. త్వరలోనే జట్టులోకి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.