ETV Bharat / sports

క్రిస్ గేల్ వచ్చేస్తున్నాడు.. ఐపీఎల్ కోసం కసరత్తులు - క్రిస్ గేల్ తాజా వార్తలు

Gayle return to IPL: ఐపీఎల్ కోసం క్రిస్ గేల్ సాధన చేస్తున్నాడు. జిమ్​లో చెమటోడుస్తున్నాడు. ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​కు దూరమైన గేల్.. మళ్లీ ఎలా వస్తున్నాడనే కదా మీ అనుమానం? ఈ స్టోరీ చదివేయండి మరి..

GAYLE
GAYLE
author img

By

Published : Mar 29, 2022, 10:14 PM IST

Gayle return to IPL: క్రికెట్​లో విధ్వంసానికి పర్యాయపదం ఏదైనా ఉందంటే అది క్రిస్ గేల్! అంతలా ఆటపై ముద్ర వేశాడు ఈ కరీబియన్ వీరుడు. పొట్టి ఫార్మాట్​లో ఎడాపెడా బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడే గేల్ ఆటను.. ఈసారి ఐపీఎల్​లో చాలా మంది మిస్ అవుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి తన పేరును గేల్ నమోదు చేసుకోలేదు. దీంతో సీజన్​కు దూరమయ్యాడు. అయితే, తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు గేల్. ఐపీఎల్​ కోసం సిద్ధమవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ సీజన్​కు కాదండోయ్. 2023లో జరిగే ఐపీఎల్​ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

IPL 2022: ఈ ఏడాది చివర్లో గేల్​కు 43 ఏళ్లు నిండుతాయి. అయితే, ఈ వయసులోనూ తాను ఎవరికీ తక్కువ కాదని చెబుతున్నాడు ఈ యూనివర్స్ బాస్. అందుకే ఫిట్​నెస్​పై దృష్టిసారించాడు. జిమ్​లో చెమటలు వచ్చేలా వర్కౌట్లు చేస్తున్నాడు. తర్వాతి ఎడిషన్ ఐపీఎల్​కు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్​లో ఇప్పటివరకు మూడు ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు గేల్. 2009లో కోల్​కతా తరఫున ఆడిన గేల్... ఆ తర్వాత ఆర్సీబీ తరఫున వీరవిహారం చేశాడు. అనంతరం పంజాబ్​కు మారాడు. గతేడాది అతడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. 10 మ్యాచ్​లు ఆడిన గేల్.. 21.44 నామమాత్రపు సగటుతో 193 పరుగులు చేశాడు.

Gayle return to IPL
జిమ్​లో గేల్ వర్కౌట్లు

ఐపీఎల్ 2022 సీజన్​కు దూరమవుతున్నానని ఈ ఏడాది జనవరిలో ప్రకటించి అందరికీ షాకిచ్చాడు గేల్. దీంతో అతడి ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే భావించారు. అయితే, వచ్చే ఏడాది రానున్నట్లు చేసిన తాజా ప్రకటనతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్​లో 142 మ్యాచ్​లు ఆడి.. 4965 పరుగులు చేశాడు గేల్. అందులో ఆరు శతకాలు ఉన్నాయి. సెంచరీల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు.

ఇదీ చదవండి: 'మంచి స్పిన్నర్లు ఎందరో ఉంటారు.. వార్న్​ మాత్రం భిన్నం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.