ETV Bharat / sports

టేబుల్​ టాపర్​తో దిల్లీ ఢీ.. కేకేఆర్​ జైత్రయాత్రకు బ్రేక్​ పడేనా? - దిల్లీ డేర్​డెవిల్స్​

IPL 2022: మెగా టీ20 లీగ్​లో ఆదివారం డబుల్​ ధమాకా ఉండనుంది. మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​తో దిల్లీ క్యాపిటల్స్​​ తలపడనుండగా.. సాయంత్రం జరగనున్న మరో మ్యాచ్​లో లఖ్​నవూతో రాజస్థాన్​ రాయల్స్​ పోటీపడనుంది. మరి ఈ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

IPL 2022
రిషబ్​ పంత్​, శ్రేయస్​ అయ్యర్​
author img

By

Published : Apr 10, 2022, 10:47 AM IST

IPL 2022: ఐపీఎల్​ మెగా టీ20 లీగ్​లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ పాయింట్స్​ టేబుల్​లో టాప్​లో ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ను దిల్లీ క్యాపిటల్స్​​ ఢీకొట్టనుంది. ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఈ మ్యాచ్​లో కేకేఆర్​ జైత్రయాత్రకు బ్రేక్​ వేసి ట్రాక్​లోకి రావటం పంత్​ సేనకు అంత సులభమేమీ కాదు. రెండు వరుస ఓటములతో డీలా పడిన దిల్లీ ఈ మ్యాచ్​ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిద్దాం..

బలాబలాలు ​.. ఐపీఎల్​లో దిల్లీ జట్టును పోటీలో నిలిపాడు మాజీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​. 2020లో దిల్లీని ఫైనల్​కు చేర్చాడు. అయితే.. గాయం కారణంగా గత ఏడాది సీజన్​లో తొలి అర్ధభాగం టోర్నీకి దూరమవ్వటంతో జట్టు పగ్గాలు రిషబ్​ పంత్​కు అప్పగించింది దిల్లీ. ఇటీవల జరిగిన మెగా వేలంలో శ్రేయస్​ను దిల్లీ వదులుకుంది. ప్రస్తుత సీజన్​లో శ్రేయస్​ సారథ్యంలో కేకేఆర్​ మూడు విజయాలతో టేబుల్​ టాప్​లో ఉంది. కేవలం ఆర్​సీబీపైనే ఓటమి పాలైంది. మరోవైపు.. దిల్లీ క్యాపిటల్స్​ ఈ సీజన్​ను విజయంతో ప్రారంభించినా.. ఆ తర్వాత రెండు వరుస ఓటములతో వెనకబడిపోయింది. పాయింట్స్​ టేబుల్​లో 7వ స్థానంలో కొనసాగుతోంది. పంత్​, శ్రేయస్​ భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్లుగా పలువురు భావిస్తున్న తరుణంలో ఇరువురి మధ్య పోరు ఆసక్తికరంగా కనిపిస్తోంది.

IPL 2022
పాయింట్స్​ టేబుల్​

బౌలింగ్​ సమస్యతో సతమతమవుతున్న దిల్లీకి దక్షిణాఫ్రికా ఆటగాడు అన్రిచ్​ నోర్జే​ చేరడం ఊరట కలిగించే విషయమే అయినా.. టీ20 ప్రపంచ కప్​ నుంచి అతను బౌలింగ్​ చేయలేదు. టాప్​ బౌలర్స్ ఉన్నప్పటికీ ధారాళంగా పరుగులు ఇస్తుండటం దిల్లీని కలవరపెడుతోంది. ముస్తఫిజర్​ రెహ్మాన్​ ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. అటు బ్యాటింగ్​లోనూ తడబడుతోంది దిల్లీ. మరోవైపు.. ముంబయి ఇండియన్స్​పై విజయంతో మంచి జోష్​ మీదుంది కోల్​కతా. ఆల్​రౌండర్​ ప్రదర్శనతో ఆటగాళ్లు జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ప్రధాన బౌలర్​ ఉమేశ్​ యాదవ్​ మంచి ఫామ్​లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే విషయం.

లఖ్​నవూను రాజస్థాన్​ అడ్డుకుంటుందా?: మూడు వరుస విజయాలతో దూసుకెళ్తున్న లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో ఆదివారం సాయంత్రం తలపడనుంది రాజస్థాన్​ రాయల్స్​. తొలి సీజన్​లోనే అద్భుత ప్రదర్శనతో పాయింట్స్​ టేబుల్​లో టాప్​-3లో కొనసాగుతోంది లఖ్​నవూ. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచి ఉత్సాహంతో ఉంది. తొలి మ్యాచ్​ గుజరాత్​ టైటాన్​తో ఓడినా.. ఆ తర్వాత చెన్నై సూపర్​ కింగ్స్​, హైదరాబాద్​, దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఎవిన్​ లెవిస్​, దీపక్​ హుడా, ఆయుష్​ బదోనిలు బ్యాట్​తో రాణిస్తుండగా.. అవేశ్​ ఖాన్​, రవి బిష్ణోయ్​లు తమ స్పిన్​ మాయాజాలాన్ని చూపిస్తున్నారు. మరోవైపు.. రాజస్థాన్​ రాయల్స్​ తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించగా.. మూడో మ్యాచ్​లో ఓటమిపాలైంది. ఆర్​ఆర్​ బ్యాటర్​ జోస్​ బట్లర్​ మంచి ఫామ్​లో ఉండటం ఆ జట్టు బ్యాటింగ్​కు కలిసొచ్చే విషయం. ఐపీఎల్​ 2022 సీజన్​లో తొలి సెంచరీ నమోదు చేశాడు బట్లర్​. దేవదత్​ పడిక్కల్​, హెట్​మెయర్​లు తమవంతుగా పరుగులు రాబడుతున్నారు. అయితే.. పేసర్​ నవదీప్​ సైనీ దారాళంగా పరుగులు సమర్పించుకోవటం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చూడండి: ముంబయికి కలిసిరాని మెగా ఆక్షన్​​.. గతంలోనూ వరుస ఓటములు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.