ETV Bharat / sports

ఐపీఎల్​ మిగతా మ్యాచ్​లు ముంబయిలోనే! - ఐపీఎల్ 2021

ఐపీఎల్​లో కొవిడ్ కేసులు వెలుగు చూడటం వల్ల మిగతా టోర్నీని ముంబయికి తరలించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్ నివేదికను విడుదల చేసింది.

BCCI mulls shifting rest of IPL games to Mumbai: Report
బీసీసీఐ, ఐపీఎల్​ మిగతా మ్యాచ్​లు ముంబయిలోనే!
author img

By

Published : May 4, 2021, 8:23 AM IST

ఐపీఎల్​లో భాగంగా కోల్​కతా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. వీరితో పాటు చెన్నై సూపర్ కింగ్స్​ బృందంలోని ముగ్గురికి కొవిడ్ సోకింది. దీంతో లీగ్ నిర్వాహకులైన బీసీసీఐ సందిగ్ధంలో పడింది. టోర్నీ సజావుగా సాగాలంటే మిగిలిన మ్యాచ్​లను ముంబయికి తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

దేశంలోని కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో మహారాష్ట్ర ఒకటి. అయిప్పటికీ.. ముంబయిలో ప్రారంభ మ్యాచ్​లు సజావుగా సాగాయి. ప్రపంచ స్థాయి స్టేడియాలు మూడు ఉన్నాయి. దీంతో మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్​లను నిర్వహించడానికి ముంబయే అనుకూలమైన ప్రాంతామని బీసీసీఐ భావిస్తోందని ఓ నివేదిక వెల్లడించింది.

ఐపీఎల్​లో ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్​లు ముగిశాయి. కోల్​కతా-బెంగళూరు మధ్య జరగాల్సిన 30వ మ్యాచ్​ కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం మ్యాచ్​ జరుగుతున్న ప్రాంతాల్లో ఒకటైనా దిల్లీ కూడా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ముందుంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు దొరక్క చాలా మంది నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇదీ చదవండి: కేఎల్​ రాహుల్‌కు శస్త్రచికిత్స విజయవంతం

"కరోనా కారణంగా కొత్త ప్రణాళికను అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అదే జరిగితే ఈ వారాంతానికి లీగ్​ను ముంబయికి తరలించే అవకాశం ఉంది. మ్యాచ్​ షెడ్యూళ్లలోనూ పలు మార్పులు చేయొచ్చు. మే 30న తలపెట్టిన ఫైనల్​ను జూన్​ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది."

-ఓ క్రీడా ఛానెల్ నివేదిక.

ఐపీఎల్​ షెడ్యూల్​ను ముందు ఆరు వేదికల్లో నిర్ణయించారు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్​కతా, ముంబయిలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పటికే ముంబయి, చెన్నై స్టేడియాలలో తొలి 20 మ్యాచ్​లు సజావుగా సాగాయి. ​

ఇదీ చదవండి: కరోనా ఆందోళనతో ఐపీఎల్​ కొనసాగేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.