ETV Bharat / sports

రాజస్థాన్​కు ఎదురుదెబ్బ.. లీగ్​కు ఆర్చర్ దూరం

ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్​ ఐపీఎల్​ 14వ సీజన్​కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. లీగ్​ మధ్యలోనైనా జట్టులోకి వస్తాడని భావించిన రాజస్థాన్​కు ఇది ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు.

jofra archer, rajasthan royals
జోఫ్రా ఆర్చర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్
author img

By

Published : Apr 23, 2021, 8:00 PM IST

Updated : Apr 23, 2021, 9:25 PM IST

ఐపీఎల్​ 14వ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మోచేతి గాయం కారణంగా ఐపీఎల్​లో ఇప్పటివరకు పాల్గొనని స్టార్​ క్రికెటర్​ జోఫ్రా ఆర్చర్.. ఇక పూర్తి సీజన్​కు దూరం కానున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది.

ఇదీ చదవండి: టాస్​ గెలిచిన పంజాబ్.. ముంబయి బ్యాటింగ్

గాయం తర్వాత బౌలింగ్ సాధన మొదలు పెట్టిన జోఫ్రాను.. ఈసీబీతో పాటు ససెక్స్​ వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. "వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో ససెక్స్​ తరఫున ఆర్చర్​ సాధన మొదలుపెట్టనున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలోకి అడుగుపెడుతాడని ఆశిస్తున్నాం. వరుసగా ప్రాక్టీస్ చేస్తేనే నొప్పి పూర్తిగా తగ్గుతుంది" అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: ఇన్​స్టాలో సంజనకు బుమ్రా ప్రేమ బాణాలు

Last Updated : Apr 23, 2021, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.