ETV Bharat / sports

పాకిస్థాన్​కు​ గట్టి షాక్​.. ఆసియాకప్​ వేదిక మార్పు.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ

Asia Cup 2023 Venue Pakistan : ఆసియా కప్​ను​ తమ దేశంలో నిర్వహించాలని పట్టుబడుతున్న పాకిస్థాన్​ గట్టి దెబ్బ తగిలింది. ఆ టోర్నీని పాక్​ నుంచి షిఫ్ట్​ చేస్తున్నట్లు ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ (ఏసీసీ) ప్రకటించింది. ఆ వివరాలు..

asia cup 2023 venue pakistan
asia cup 2023 venue pakistan
author img

By

Published : May 8, 2023, 10:20 PM IST

Updated : May 8, 2023, 10:34 PM IST

Asia Cup 2023 Venue Pakistan : ఆసియా కప్​ నిర్వహించే విషయంలో పాకిస్థాన్​కు గట్టి షాక్​ తగిలింది. ఈ మెగా టోర్నీని ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ ఆ దేశం నుంచి తరలించింది. పాక్​ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్​ను కూడా తిరస్కరించింది. ఈ విషయంలో శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా బీసీసీఐకి సపోర్ట్​గా నిలిచాయి. అయితే, ఈ సారి ఆసియా కప్​ శ్రీలంకలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రీలంకకు పోటీగా యూఏఈ కూడా ఉంది. కానీ, వేసవిలో యూఏఈలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి.. శ్రీలంకలో ఆసియా కప్​ జరగడం ఇక లాంఛనమే.

అంతకుముందు, పాక్​లో ఆసియా కప్​ జరిగితే తమ జట్టును అక్కడికి పంపించబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది. అందుకే టోర్నీని పాకిస్థాన్ నుంచి వేరే దేశానికి తరలించాలని డిమాండ్​లు వినిపించాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా కూడా ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఏసీసీ ముందు ఉంచారు. అయితే ఈ ప్రతిపాదనను పాకిస్థాన్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది.

భారత్‌ మ్యాచ్‌లను మరో చోట నిర్వహించాలని, ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్‌ బోర్డుకు ఇవ్వాలని పీసీబీ చైర్మన్‌ నజం సేథీ అంతకుముందు ఏసీసీకి ప్రతిపాదించారు. దీనిపై ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో పాకిస్థాన్​ మరో షాకింగ్​ విషయం ఎంటంటే.. ఆసియా కప్​ను ఆ దేశం నుంచి షిఫ్ట్​ చేశారు కాబట్టి.. ఒకవేళ పాక్​ ఈ టోర్నీలో ఆడకపోతే.. ఆ స్థానంలో ఆ జట్టు స్థానంలో యూఏఈకి అవకాశం ఇవ్వాలని ఏసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే పాకిస్థాన్ బోర్డుకు, జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లే. ఇప్పుడు పాక్ నుంచి ఆసియా కప్ తరలించారు కాబట్టి.. ఆ దేశ క్రికెట్​ బోర్డు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి నెలకొంది.

భారత్​ ఆసియా కప్​ కోసం పాక్​లో పర్యటించకుంటే.. తాము కూడా 2023 చివర్లో ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్​ కప్​లో పాల్గొనమని గతంలో పాక్​ చెప్పింది. దీంతో ఆలోచనలో పడ్డ బీసీసీఐ.. ఆసియా రద్దు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టిందని తెలుస్తోంది. ఈ ఆసియా కప్​ టోర్నీ స్థానంలో ఐదు దేశాల టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే కనుక జరిగితే ఆసియా కప్​ నిర్వహించే టైమ్ విండోలో ఈ ప్రతిపాదిత ఐదు దేశాల టోర్నీ ఆడే ఆస్కారముంది. కాగా, గతేడాది ఆసియా కప్‌ టీ20 మెగా టోర్నీలో భారత్‌, పాకిస్థాన్​, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్​లతో పాటు హాంగ్‌ కాంగ్‌ హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకోగా.. పాకిస్థాన్​ రన్నరప్‌గా నిలిచింది.

Last Updated : May 8, 2023, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.