ETV Bharat / sports

'అశ్విన్ ఆఫ్​ స్పిన్నర్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి' - అశ్విన్ గురించి గంభీర్

దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(ravichandran ashwin ipl)​ ఆఫ్ స్పిన్నర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gautam gambhir ashwin). సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడని పేర్కొన్నాడు.

Ashwin
అశ్విన్
author img

By

Published : Sep 23, 2021, 8:25 PM IST

దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(ravichandran ashwin ipl) ఆఫ్‌ స్పిన్నర్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్ విమర్శించాడు(gautam gambhir ashwin). బుధవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు వివిధ వేరియేషన్స్‌ చూపించాడు. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌(ravichandran ashwin ipl) ఇప్పుడు ప్రపంచంలోనే మేటి ఆఫ్‌ స్పిన్నర్‌ అని, అలాంటిది హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆ స్థాయిలో బౌలింగ్‌ చేయలేదని పేర్కొన్నాడు.

"అశ్విన్‌(ravichandran ashwin ipl) తొలుత ఆఫ్‌ స్పిన్నర్‌ అనే విషయాన్ని కచ్చితంగా అర్థం చేసుకోవాలి. అతడు బౌలింగ్‌ చేసేటప్పటికే ప్రత్యర్థి జట్టు పలు వికెట్లు కోల్పోయింది. అలాంటప్పుడుÙ తన సహజసిద్ధమైన బౌలింగ్‌ చేయాల్సింది. అతడు చాలా కాలంగా సరైన క్రికెట్‌ ఆడలేదనే విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌లో నాలుగు టెస్టుల్లో అవకాశం రాలేదు, ప్రాక్టీస్‌ లేకపోవడం కూడా అర్థం చేసుకోదగినదే. ఏ మ్యాచ్‌లో ఉండే ఒత్తిడి ఆ మ్యాచ్‌కు ఉంటుంది. అతడి బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టకముందే ఆఫ్‌స్పిన్‌ వేయాల్సింది. అశ్విన్‌(ravichandran ashwin ipl) టెస్టుల మాదిరే బౌలింగ్‌ చేసి తన మార్క్‌ చూపించాల్సింది. తన బౌలింగ్‌లో ఎన్ని వైవిధ్యాలున్నా అతడు మాత్రం ఆఫ్‌ స్పిన్నరే" అని గంభీర్‌ అన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు స్టోయినిస్‌ తొమ్మిదో ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. అయితే, తొలి బంతి వేయగానే అతడు గాయం కారణంగా మైదానం వీడాడు. అనంతరం బంతి అందుకున్న అశ్విన్‌(ravichandran ashwin ipl) ఆ ఓవర్‌ పూర్తి చేసి తర్వాత మరో రెండు ఓవర్లు వేశాడు. దీంతో మొత్తం అతడు 2.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 22 పరుగులిచ్చాడు. అందులో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

ఇవీ చూడండి: సోదరులతో పనిచేస్తున్నట్లే: ఐపీఎల్​పై నవనీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.