IPL 2022: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022.. మార్చి 26న ప్రారంభం కానుంది. ఇప్పటికే అనేక జట్లు ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్ ఆటగాళ్ల ప్రదర్శన చూసేందుకు ఫ్యాన్స్ ఉత్కంఠగా ఉన్నారు. ఎందుకంటే ఐపీఎల్లో ఒక్క ఆటగాడి ప్రదర్శనతో మ్యాచ్ మలుపు తిరుగుతుంది. అలా ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్నే మార్చేయగల సత్తా ఉన్న పలువురు విదేశీ క్రికెటర్లపై ఓ లుక్కేయండి.
1.ఫాఫ్ డుప్లెసిస్(Faf Duplesis)
![Faf Duplesis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/faf_1202newsroom_1644651783_55.jpg)
2021 ఐపీఎల్లో చైన్నై జట్టు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఫాఫ్ డుప్లెసిస్. దక్షిణాఫ్రికాకు చెందిన డుప్లెసిస్ గత ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన విదేశీ ఆటగాడు. ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. గతేడాది డుప్లెసిస్ చేసిన ప్రదర్శన పునరావృత్తం కావాలని ఆర్సీబీ ఆశిస్తోంది.
2.గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell)
![Glenn Maxwell](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/glenn-maxwell_2010newsroom_1634721534_659.jpg)
గతేడాది అద్భుత ప్రదర్శన చేయడం వల్ల మ్యాక్స్‌వెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెయిన్ చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఇతడు 2021 ఐపీఎల్లో 500 పైగా పరుగులు చేశాడు. అదే ప్రదర్శనను కొనసాగించి ఆర్సీబీ తొలి కప్పు గెలిచేలా కృషి చేస్తాడో చూడాలి.
3. మొయిన్ అలీ(Moeen Ali)
![Moeen Ali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14694927_moin.jpg)
ఇంగ్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెగావేలానికి ముందే రిటెయిన్ చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్లో అలి 357 పరుగులు చేసి కప్పు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అదే జోష్‌ను కొనసాగించాలని అతడు భావిస్తున్నాడు.
4. క్వింటన్ డికాక్(Quinton Decock)
![Quinton Decock](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/d85e7a9ba1cd33fc28db5ca857860049_2810a_1635411036_827.jpg)
ముంబయ్ ఇండియన్స్ తరఫున అత్యధిక పరగులు చేసిన ఆటగాడు క్వింటన్ డికాక్. ఈ ఏడాది డికాక్.. కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జెర్సీలో కనపడనున్నాడు. గతేడాది అతడు 297 పరగులు చేయగా.. మరోసారి తన పరుగుల దాహాన్ని తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు.
5. కేన్ విలియమ్సన్(Kane williamson)
![(Kane williamson)](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14694927_kane.jpg)
ఐపీఎల్ 2022లో కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గతేడాది ఐపీఎల్లో 266 పరుగులతో కేన్ మంచి ఆటతీరు కనపరిచాడు. అయితే జట్టు ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. తనతో పాటు జట్టు కూడా ఈ సారి మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తున్నాడు కేన్.
6. జోస్ బట్లర్(Jos Buttler)
![Jos Buttler](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/52c7b07ec534540c633c68659752b3be_3110a_1635668980_302.jpg)
గతేడాది ఏడు మ్యాచులే ఆడిన బట్లర్ 200పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌ను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం రిటెయిన్ చేసుకుంది. బట్లర్‌కు ప్రత్యర్థి బౌలింగ్ అటాక్‌ను ఒంటి చేత్తో ఎదుర్కొగల సత్తా ఉంది.
7. జానీ బెయిర్‌స్టో(Jhony Bairstow)
![Jhony Bairstow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10668200_929261-717050-jonny-bairstow-reuters.jpg)
2021 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన బెయిర్‌స్టో ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టులో ఆడనున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన బెయిర్‌స్టోకు భారీ షాట్లు కొట్టగలిగే సామర్థ్యం ఉంది. తొలి మ్యాచ్ నుంచి విజృంభించి ఆడాలని పంజాబ్ కోరుకుంటుంది.
మరి ఈసారి జరగబోయే ఐపీఎల్లో ఈ విదేశీ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
ఇదీ చదవండి: Rohit Sharma: 'రోహిత్‌ను మించిన సారథి లేడు'