ETV Bharat / sports

IPL mega auction: భారీ ధరకు సింగపూర్​, వెస్టిండీస్​ ప్లేయర్ - IPL mega auction 2022 Romario Shepherd

IPL mega auction 2022: ఐపీఎల్ రెండు రోజు మెగావేలంలో పలువురు ఆటగాళ్లు తక్కువ బేస్​ ప్రైస్​తో వచ్చి మంచి ధర పలికారు. వీరిలో సింగపూర్​ ఆటగాడు టిమ్​ డేవిడ్​, వెస్టండీస్​ ఆల్​రౌండర్లు ఒడియన్​ స్మిత్​, రొమారియో షెపర్డ్ ఉన్నారు.

tim david
టిమ్​ డేవిడ్​
author img

By

Published : Feb 13, 2022, 8:04 PM IST

IPL mega auction 2022: ఐపీఎల్​ రెండు రోజు వేలం కూడా ఆసక్తికరంగా సాగుతోంది. కొంతమంది ప్లేయర్లు అధిక ధరకు అమ్ముడుపోతుండగా మరికొందరు తక్కువ ధర పలుకుతున్నారు. అయితే ఈ ఆటగాళ్లలో వెస్టిండీస్​ ఆల్​రౌండర్​లు అదరగొట్టారు. ఒడియన్​ స్మిత్​, రొమారియో షెపర్డ్​కు భారీ ధర దక్కింది. అంతర్జాతీయ టీ-20 టోర్నీల్లో అదరగొడుతున్న ఆల్​రౌండర్​ టిమ్​ డేవిడ్​ మంచి ధర పలికాడు.

టిమ్​డేవిడ్​

అంతర్జాతీయ టీ-20 టోర్నీల్లో అదరగొడుతున్న ఆల్​రౌండర్​ టిమ్​ డేవిడ్​ను మంచి ధర పలికాడు. ఇతడి కోసం పలు జట్లు పోటీపడినా చివరికి ముంబయిదే పైచేయి అయింది. రూ. 8.25 కోట్లకు అతడిని​ దక్కించుకుంది. ఇతడి టీ-20 స్ట్రైక్​ రేట్​ 159.39 కావడం విశేషం. బంతిని బలంగా బాదగల ఈ పొడగరి కచ్చితంగా టీమ్​లో ఉండే అవకాశముంది.

6.5 అడుగుల ఎత్తు ఉండే టిమ్​.. ఇప్పటివరకు 14 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 558 పరుగులు చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 92 నాటౌట్​. ఇతడు స్పిన్​ బౌలింగ్​ కూడా చేయగలడు. గతంలో టిమ్​.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.

స్మిత్​

స్మిత్​ కోసం పంజాబ్​ కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ పోటీ పడగా.. చివరకు పంజాబ్​ రూ.6కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, భారత్​తో జరిగిన వన్డే సిరీస్​లో స్మిత్​ అద్భుతంగా రాణించాడు. టీమ్​ఇండియాతో ఆడిన రెండు వన్డేల్లో అతడు 60 పరుగులు సహా మూడు వికెట్లు తీశాడు. కరేబియన్​ ప్రీమియర్​ లీగ్​-2021లో కూడా అద్భతంగా రాణించాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్​గా నిలిచాడు.

షెపర్డ్​

మరో ఆల్​రౌండర్​ రొమారియో షెపర్డ్​ను రూ.7.75కోట్లకు సన్​రైజర్స్​ హైదరాబాద్​ సొంతం చేసుకుంది. వేలంలో రూ.75లక్షల కనీస ధరతో వచ్చిన అతడి కోసం లక్నో సూపర్​ జెయింట్స్​, ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​, సన్​రైజర్స్ పోటీపడ్డాయి. చివరకు అతడు సన్​రైజర్స్​ గూటికి చేరాడు.

2019లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు షెపర్డ్​. ఇప్పటివరకు అతడు 10 వన్డేలు, 14 టీ20 మ్యాచులు ఆడాడు. ఇటీవల ఇంగ్లాండ్​తో జరిగిన టీ20సిరీస్​లో బాగా రాణించాడు.

ఇదీ చూడండి: వారి కోసం కోట్లు కుమ్మరించిన ముంబయి ఇండియన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.