ETV Bharat / sports

'రాహుల్స్​' దశ తిరిగింది- వేలంలో కోట్లకు కోట్లు..!

Rahuls name in IPL auction: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ వేలం ఆసక్తికరంగా సాగుతోంది. శనివారం, పలువురు ఆటగాళ్లను కోట్లకు కోట్లు పెట్టి ఆయా ఫ్రాంఛైజీలు కొనుక్కున్నాయి. ఇషాన్​ కిషన్​, దీపక్​ చాహర్​, శ్రేయస్​ అయ్యర్​ తదితరులు రికార్డు ధర పలికారు. అయితే.. రాహుల్​ పేరు ఉన్న పలువురు క్రికెటర్లు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంతకీ ఆ సంగతేంటంటే?

author img

By

Published : Feb 13, 2022, 11:25 AM IST

IPL Auction 2022
IPL Auction 2022

Rahuls name in IPL auction: ఐపీఎల్​ మెగా వేలంలో పలువురు ఆటగాళ్లు జాక్​పాట్​ కొట్టారు. ఇషాన్​ కిషన్​(రూ. 15.25 కోట్లు), దీపక్​ చాహర్​(రూ. 14 కోట్లు), శ్రేయస్​ అయ్యర్​(రూ.12.25 కోట్లు), శార్దుల్​ ఠాకుర్​, నికోలస్​ పూరన్​, హసరంగ, హర్షల్​ పటేల్​(రూ. 10.75 కోట్లు) మిలియనీర్ల క్లబ్​లో చేరారు.

అయితే ఇక్కడే ఒకటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • వేలానికి ముందు కేఎల్​ రాహుల్​ను రూ. 17 కోట్లకు దక్కించుకుంది లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​. కొన్ని సీజన్లుగా పంజాబ్​.. రాహుల్​ను రూ. 11 కోట్ల ధరకే అట్టిపెట్టుకొంది.
  • శనివారం జరిగిన తొలిరోజు వేలంలో రాహుల్​ తెవాటియా అత్యంత ఆకర్షణగా నిలిచాడు. ఇతడి కోసం చెన్నై చివరి వరకు ప్రయత్నించినా.. గుజరాత్​ టైటాన్స్​ రూ.9 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గతేడాది రాజస్థాన్ జట్టు​ తెవాటియాకు చెల్లించింది రూ. 3 కోట్లు మాత్రమే.
  • గత సీజన్​లో కోల్​కతాకు ఆడిన రాహుల్​ త్రిపాఠిని రూ. 8.50 కోట్ల భారీ ధరకు సన్​రైజర్స్​ చేజిక్కించుకుంది. ఇతడి కోసం కేకేఆర్​, చెన్నై బాగానే ప్రయత్నించాయి. అంతకుముందు సీజన్​లో కోల్​కతా ఇతడికి ఇచ్చింది రూ. 60 లక్షలే.
  • కొన్నిసీజన్లుగా ముంబయికి ఆడిన రాహుల్​ చాహర్​ కోసం దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు ప్రయత్నించాయి. చివరకు రూ. 5.25 కోట్ల ధరకు పంజాబ్​ సొంతమయ్యాడు. 2021లో ముంబయి ఇతడికి చెల్లించింది రూ. 1.90 కోట్లు.

పైది గమనిస్తే మీరొకటి తెలుసుకోవచ్చు. ఈ నలుగురి పేర్లలో 'రాహుల్​' ఉంది. కేఎల్ రాహుల్​, రాహుల్​ తెవాటియా, రాహుల్​ త్రిపాఠి, రాహుల్​ చాహర్​.. వీళ్లంతా శనివారం వేలంలో కోట్లకు కోట్లు పలికారు. అంతకుముందు ధర కంటే పెద్దమొత్తంలో సొంతం చేసుకున్నారు.

ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. రాహుల్​ పేరు పెట్టుకుంటే ఐపీఎల్​లో దశ తిరిగినట్లేనని మీమ్స్​ చేస్తున్నారు.

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ కూడా దీనిపై ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టాడు. నలుగురు రాహుల్​లు.. రూ. 39.75 కోట్లకు అమ్ముడుపోయారని ట్వీట్​ చేశాడు.

IPL Auction 2022
సెహ్వాగ్​ ట్వీట్​

ఇవీ చూడండి:

IPL 2022 Mega Auction: అత్యధిక ధర పలికిన బౌలర్లు వీరే

ధోనీని మించిన దీపక్‌... రోహిత్ శర్మకు చేరువగా ఇషాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.