IPL 2024 Mini Auction : ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ క్రికెట్ అభిమానులను దాదాపు నెలన్నర రోజుల పాటు అలరించింది. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. డిసెంబర్లో జరగనున్న 2024 ఐపీఎల్ మినీ వేలం ఇందుకు కారణం. ఇప్పటికే పలు జట్లు ట్రేడింగ్ విండోలో ప్లేయర్లను ట్రేడ్ చేసుకుంటున్నాయి. ఆ తర్వాత మినీ వేలంలో.. అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించేందుకు రెడీ అవుతున్నాయి.
ఈ 2024 ఐపీఎల్ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. మిచెల్ స్టార్క్ వంటి ప్లేయర్లు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఈ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు తిరిగి వస్తున్నారు. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఈ మినీ వేలంపై పడింది. వచ్చే నెల చివర్లో ఈ వేలం జరగే అవకాశం ఉంది. ఇక ఈ వేలంలో ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ కూడా మరింత పెరిగింది. దీంతో బ్యాటు బంతితో రెచ్చిపోయే ఆటగాళ్ల కోసం.. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము రిటైన్ లేదా రిలీజ్ చేసిన ప్లేయర్ల తుది జాబితా ఇచ్చేందుకు నవంబర్ 26 వరకు గడువు పొడగించింది బీసీసీఐ. మరోవైపు వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉండటం వల్ల.. చాలా మంది ప్రముఖ ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, న్యూజిలాండ్ జట్టు సంచలన ప్లేయర్ రచిన్ రవీంద్ర, దక్షితాఫ్రికా పేసర్ కోట్జీ వంటి ప్లేయర్లు ఈసారి వేలంలో అధిక ధర పలికే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక రానున్న మూడు నాలుగు రోజుల్లో ఈ ప్లేయర్ల లిస్ట్‌ను ఫైనల్ చేస్తారని సమాచారం. అయితే గతేడాది రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలో తన పేరు నమోదు చేసుకున్న ట్రావిస్ హెడ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం గమనార్హం.
టీమ్ఇండియాకు కొత్త హెడ్ కోచ్! - రాహుల్ స్థానంలో లక్ష్మణ్?
మాజీ క్రికెటర్‌పై ఐసీసీ వేటు- ఆరేళ్ల పాటు నిషేధం- ఎందుకో తెలుసా?