ETV Bharat / sports

IPL 2023: ఐపీఎల్ సమరానికి సిద్ధం.. సీఎస్కే వర్సెస్​ గుజరాత్​.. బోణీ కొట్టేదెవరో?

మరి కొన్ని గంటల్లో ఐపీఎల్​ సమరం ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​ చెన్నై సూపర్ కింగ్స్​-డిఫెండింగ్ ఛాంపియన్​ గుజరాత్​ మధ్య జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ షురూ కానుంది. మరి ఈ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో?

IPL 2023 first match CSK Vs GT Prediction
ఐపీఎల్ సమరానికి సిద్ధం.. సీఎస్కే వర్సెస్​ గుజరాత్​.. బోణీ కొట్టేదెవరో?
author img

By

Published : Mar 31, 2023, 6:23 AM IST

టీ20 క్రికెట్‌ అంటేనే రసవత్తర పోరాటాలకు కేరాఫ్​ అడ్రెస్​. అలాంటిది ఇక ఐపీఎల్‌ అంటే ఆ మజానే వేరబ్బా. దాని గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాలా. 15 సీజన్ల నుంచి హోరాహోరీగా మ్యాచ్‌లు.. ఊహకందని మలుపులు.. కళ్లు తిప్పుకోనివ్వని ఉత్కంఠ క్షణాలు.. చివరి నిమిషం వరకూ సాగే పోరాటాలు.. నిమిషాల్లో మారే ఫలితాలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయి. అయితే ప్రతిసారీ అభిమానులకు బోలేడు వినోదాన్ని పంచే ఈ మెగాటోర్నీ.. ఈ సారి మరింత వినోదాన్ని, కిక్కును అందించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి కొన్ని గంటల్లో ఈ క్రికెట్​ సంబరానికి తేరలేవనుంది. అసలు సిసలైన సమరం మొదలుకానుంది. ఈ 16వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్- డిఫెండింగ్​ ఛాంపియన్​ గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోరుతో గ్రాండ్​గా ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే గతేడాది తమ తొలి సీజన్​లో ఛాంపియన్​గా అవతరించిన గుజరాత్​ టైటాన్స్​.. ఈ సారి లీగ్​లోనూ విజయాన్ని కొనసాగించాలని జోష్​తో ఉంది. అలాగే గత సీజన్​లో గ్రూప్​ దశలోనే వైదొలిగిన చెన్నై సూపర్ కింగ్స్​.. ఈ సారి ఎలాగైనా కప్​ కొట్టాలని పట్టుదలతో ఉంది. అలా ఈ ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే-హార్దిక్​ కెప్టెన్సీలో గజరాత్​.. రెండు జట్లు బరిలోకి దిగబోతున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు బలహీనతలపై ఓ లుక్కేద్దాం..

ధోనీ లేకుండానే.. సీఎస్కే తొలి మ్యాచ్​కు ముందే పెద్ద షాక్ తగిలింది. ప్రాక్టీస్ మ్యాచ్​లో ధోనీ గాయపడ్డాడు. అతడు ఆడేది అనుమానంగా మారింది. ఓపెనర్లుగా డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్​లు ఆడే అవకాశం ఉంది. మూడో స్థానంలో బెన్ స్టోక్స్ దిగొచ్చు. జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, బెన్ స్టోక్స్.. ఇలా జట్టులో నలుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు. అయితే తొలి మ్యాచ్​లో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేసేది అనుమానమే. ఇక బౌలర్లలో దీపక్ చహర్, సిమ్రన్ జీత్ సింగ్, డ్వేన్ ప్రిటోరియస్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో బాగా రాణించిన యువ పేసర్ ముఖేశ్ చౌదరి గాయంతో దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆకాశ్ సింగ్​ను ఎంపిక చేశారు. బ్యాటింగ్​లో అంబటి రాయుడుతో జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్​లో జడేజా, బెన్​స్టోక్స్, అంబటి రాయుడుతో జట్టు బలంగా ఉంది.

ఫుల్​ ఫామ్​లో గుజరాత్​.. గుజరాత్ జట్టులో శుభమన్​ గిల్​ మంచి ఫామ్​లో ఉన్నాడు. అతడు, సాహా ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఓపెనర్​గా బరిలోకి దిగాల్సిన డేవిడ్​ మిల్లర్​.. అంతర్జాతీయ మ్యాచులు ఉన్న కారణంగా అతడు కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. దీంతో మ్యాథ్యూ వేడ్​కు అవకాశం దక్కొచ్చు. కేన్ విలియమ్సన్ గుజరాత్ తరఫున తెరంగేట్రం చేసే ఛాన్స్​ ఉంది. హార్దిక్ పాండ్య, తెవాటియాలతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, షమీ, సాయికిషోర్, అల్జారీ జోసెఫ్​లు కీలకంగా ఉన్నారు. ఒకవేళ అల్జారీ జోసెఫ్​ను ఆడించకపోతే జాష్ లిటిల్ బరిలోకి దిగొచ్చు.

హెడ్​ టు హెడ్​.. గతేడాది మెగాటోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్​.. చెన్నై సూపర్ కింగ్స్​తో ఆడింది రెండే మ్యాచులు. ఈ రెండింటిలోనూ హార్దిక్ పాండ్య సేననే విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్.. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ మ్యాచ్ సాగే కొద్దీ.. స్పిన్నర్లు ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తారు. ఇక్కడి పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 170. ఎక్కువగా ఛేజింగ్ చేసే జట్టే ఇక్కడ విజయాలు సాధిస్తూ వచ్చాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్​తోనే ఐపీఎల్​లో ఇంపాక్ట్​ ప్లేయర్​ రూల్​ అమలులోకి రానుంది.

ప్రారంభ వేడుకల్లో రష్మిక,తమన్న..
ఐపీఎల్‌ ఓపెనింగ్​ రోజు ఆడిపాడే స్టార్స్​ లిస్ట్​లోకి దక్షిణాది హీరోయిన్​ రష్మిక చేరింది. ఐపీఎల్‌ యాజమాన్యం ఆమె ప్రదర్శన గురించి తెలియజేస్తూ సోషల్​ మీడియాలో ఓ పోస్ట్​ పంచుకుంది. 'మరపురాని సాయంత్రం కోసం సిద్ధంగా ఉండండి. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుకలో రష్మిక ప్రదర్శ ఇవ్వనున్నారు' అంటూ క్యాప్షన్​ను జోడించారు .'రష్మిక మంచి నటే కాదు గొప్ప డ్యాన్సర్‌ కూడా. ఇప్పుడు మరోసారి లైవ్‌లో తన డ్యాన్స్‌తో వీక్షకులను అలరించనున్నారు' అని రష్మిక పర్ఫార్మెన్స్​ గురించి చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో తమన్నా కూడా ఆడిపాడనున్న విషయం తెలిసిందే.

IPL 2023 first match CSK Vs GT Prediction
ఐపీఎల్​ షెడ్యూల్​

ఇదీ చూడండి: CSKకు ఊహించని షాక్​.. ధోనీకి గాయం.. ఫస్ట్ మ్యాచ్​కు డౌటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.