ETV Bharat / sports

2023లో చెన్నై కెప్టెన్​ అతడే​.. మేనేజ్​మెంట్​ కీలక ప్రకటన

IPL 2023 CSK Captain : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్​లో వచ్చే ఏడాది చెన్నై కెప్టెన్సీపై కీలక ప్రకటన చేశారు టీమ్​ సీఈఓ కాశీ విశ్వనాథన్​.

IPL 2023 CSK Captain
IPL 2023 CSK Captain
author img

By

Published : Sep 4, 2022, 5:48 PM IST

Updated : Sep 4, 2022, 8:41 PM IST

IPL 2023 CSK Captain : ఐపీఎల్​​ చరిత్రలోనే అత్యధిక సార్లు ఫైనల్​కు చేరిన జట్టుగా.. అత్యధిక అభిమానులు ఉన్న జట్టుగా చెన్నై సూపర్​ కింగ్స్​ పేరు సంపాదించుకుంది. లీగ్​ చరిత్రలోనే రెండో విజయవంతమైన జట్టుగా సీఎస్​కే రికార్డు సృష్టించింది. టోర్నీ ఆరంభం నుంచి చెన్నై కెప్టెన్​గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్​ ధోనీ 2022లో జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాకు కెప్టెన్​గా అవకాశం ఇచ్చింది యాజమాన్యం. కానీ టీం పేలవ ప్రదర్శనతో ఒత్తిడిని తట్టుకోలేని జడ్డూ.. మళ్లీ ధోనీని సారథ్య బాధ్యతలు చేపట్టాలని కోరగా అందుకు ధోనీ అంగీకరించాడు. మరి ఈసారి కెప్టెన్​గా ఎవరు కొనసాగుతారనే దానిపై చెన్నై సూపర్​ కింగ్స్​ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు సార్లు కప్పు తెచ్చిపెట్టిన మహేంద్ర సింగ్ ధోనీనే మళ్లీ 2023లోనూ సీఎస్​కే కెప్టెన్​గా ఉంటాడని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​ ప్రకటన చేశారు.

2008లో ఐపీఎల్​ మొదలైన నాటి నుంచి సీఎస్​కే జట్టు కెప్టెన్​గా కొనసాగుతున్నాడు ధోనీ. గతేడాది జడేజా సారథ్యం వహించిన తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింట్లో చెన్నై ఓడిపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన సీఎస్​కే ఆరంభంలో ఎదురైన ఓటముల వల్లే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలను కోల్పోయింది. వచ్చే ఐపీఎల్‌లోనూ ఆడతానని ధోనీ గత సీజన్లోనే స్పష్టం చేశాడు.

ఇవీ చదవండి: దాయాదితో పోరుకు సిద్ధం.. జడేజా స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

సన్​రైజర్స్​ సంచలన నిర్ణయం.. టామ్​ మూడికి గుడ్​బై.. కొత్త కోచ్​ ఎవరంటే.

Last Updated : Sep 4, 2022, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.