ETV Bharat / sports

అప్పుడేమో ఐపీఎల్ స్టార్స్.. ఇప్పుడేమో అన్​సోల్డ్​ ప్లేయర్స్​.. - ఐపీఎల్ 2022 అన్​సోల్డ్ న్యూస్​

IPL 2022 Unsold Players: ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో కొంతమంది ఆటగాళ్లకు అనూహ్య రీతిలో ధరలు పెరిగాయి. మరికొంత మంది ప్రధాన ఆటగాళ్లను పక్కకు పెట్టేశాయి ఫ్రాంఛైజీలు. అన్​సోల్డ్​గా మిగిలిపోయిన టాప్​ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..

IPL 2022 Unsold Players
ఐపీఎల్ 2022
author img

By

Published : Feb 14, 2022, 9:31 PM IST

IPL 2022 Unsold Players: రెండు రోజుల పాటు ఆసక్తిగా సాగిన ఐపీఎల్​ మెగావేలం ముగిసింది. ఈ వేలంలో కొంతమంది ప్లేయర్లు అనూహ్య రీతిలో భారీ ధర పలకగా.. మరికొంత మంది ఆటగాళ్ల ధరలు సగానికి పైగా పడిపోయాయి. అసలు ఈ మెగాటోర్నీకి పర్యాయపదంగా మారిన కొంతమంది స్టార్​ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు అసలు ఆసక్తి కూడా చూపలేదు. ఓ సారి అన్​సోల్డ్​గా మిగిలిపోయిన టాప్​ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..

సురేశ్​రైనా

IPL 2022 Suresh Raina: సురేశ్​ రైనా.. ఇతడిని చెన్నై అభిమానులు ముద్దుగా చిన్న తలా అని పిలుచుకుంటారు. 2008 నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు ఆ జట్టు విజయాల్లో ఎన్నో సార్లు కీలకంగా వ్యవహరించాడు. కెరీర్​లో ఇప్పటివరకు 205 ఐపీఎల్​ మ్యాచులు ఆడి 5528 పరుగులు చేశాడు. కానీ అతడికి తాజా మెగాఆక్షన్​లో నిరాశ ఎదురైంది. రూ.2కోట్లు కనీస ధరతో బరిలో దిగిన అతడిని సీఎస్కేనే కాకుండా మిగతా ఏ జట్లు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే.. ఫామ్​లో లేని కారణంగానే అతన్ని తీసుకోలేదని సీఎస్కే తెలిపింది. తమ టీంకు ఫిట్​ కాడని భావించినట్లు స్పష్టం చేసింది.

IPL 2022 Unsold Players
సురేశ్​రైనా

ఇయాన్​ మోర్గాన్​

IPL 2022 News: 2019 వన్డే ప్రపంచకప్​ విజేతగా నిలిపిన ఇయాన్​ మోర్గాన్​.. గతసీజన్​లో కేకేఆర్​కు సారథిగా ఉన్నాడు. కాగా, ఆర్సీబీ కెప్టెన్​గా కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో అతడు ఆ జట్టుకు సారథి అవుతాడని అంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా అతడిని ఏ జట్టు కూడా తీసుకోలేదు.

అరోన్​ ఫించ్

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియాను అరోన్​ ఫించ్​ విజేతగా నిలిపాడు. ఇప్పటివరకు 87 మ్యాచులు ఆడి 2005 రన్స్​ చేశాడు. అందులో 14 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. రూ.1.5 కోట్లతో వేలంలోకి వచ్చిన అతడి వైపు ఏ జట్టు కూడా కన్నెత్తి చూడలేదు.

స్టీవ్​ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్​ బ్యాటర్​.. గత సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ఆడాడు. ఆడిన 8 మ్యాచుల్లో 152 పరుగులు మాత్రమే చేశాడు. గత కొద్ది కాలంగా టీ20 ఫార్మాట్​లో పెద్దగా రాణించలేకోపోతున్నాడు. అందుకే ఇతడిని ఎవరూ తీసుకోలేదు.

IPL 2022 Unsold Players
స్టీవ్​ స్మిత్

షకీబుల్​ హసన్

గత సీజన్​లో ఇతడు పెద్దగా ఆడలేకపోయాడు. దీంతో కేకేఆర్​ అతడిని వేలంలోకి వదిలింది. అయినా ఇతడి కొనుగోలు చేసేందుకు ఎవరూ సాహసం చేయలేదు.

IPL 2022 Unsold Players
షకీబుల్​ హసన్

ఆదిల్​ రషీద్

సన్​రైజర్స్​ నుంచి రషీద్​ ఖాన్​ వెళ్లిపోయాక అతడి స్థానంలో ఆదిల్​ రషీద్​ను తీసుకుంటారని అభిమానులు అనుకున్నారు. కానీ అతడి ఆ జట్టుతో పాటు మిగతా ఫ్రాంఛైజీలు కూడా కొనే ప్రయత్నం చేయలేదు.

ఇమ్రాన్ తాహిర్

దక్షిణాఫ్రికా సీనియర్​ లెగ్​ స్నిన్నర్​.. గత సీజన్​లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ బెంచ్​కే పరిమితమయ్యాడు. దీంతో ఇతడిపైనా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

ఇంగ్లాండ్​ క్రికెటర్​ డేవిడ్​ మలాన్​, ఆస్ట్రేలియా ప్లేయర్​ క్రిస్​ లిన్​, దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ షమ్సీని తీసుకోవాడనికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు.

ఇదీ చదవండి: IPL 2022: సీఎస్కే.. ఈ సారి వేలంలో రూటు మార్చిందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.