ETV Bharat / sports

IPL 2022: టాప్ జట్లకు వరుస షాక్​లు.. ఉత్కంఠగా ప్లేఆఫ్స్ బెర్తులు - ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్​ ఆర్సీబీ

IPL 2022 Playoff teams: ఈ ఐపీఎల్​లో ఇప్పటికే గుజరాత్‌ 8 విజయాలతో దాదాపుగా ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. లఖ్‌నవూ సైతం 8వ విజయం సాధించింది. శనివారం బ్యాటుతో చెలరేగి, బంతితో విజృంభించిన ఆ జట్టు.. కోల్‌కతాను చిత్తు చేసి ప్లేఆఫ్స్‌ దిశగా అడుగులేసింది. మరో మ్యాచ్​లో రాజస్థాన్ సైతం తిరిగి విజయాల పట్టి ప్లేఆఫ్స్​ దిశగా ఓ అడుగు ముందుకేసింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్​కు చేరే భారీ అంచనాలున్న జట్లు ఏవీ, వాటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..

IPL 2022 Playoffs
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్​
author img

By

Published : May 8, 2022, 10:05 AM IST

Updated : May 8, 2022, 10:44 AM IST

IPL 2022 Playoff teams: ఈ ఐపీఎల్​ సీజన్​ కీలక దశకు చేరుకుంది. మెగా టోర్నీలో కొత్త జట్ల హవా కొనసాగుతోంది. ఇకపై ముంబయి, చెన్నై మినహా మిగతా జట్లు అన్నింటికీ ప్రతి మ్యాచ్‌ అతి ముఖ్యమైనదే. అయితే, ఇన్ని రోజులూ ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖాయం చేసుకునేలా కనిపించిన ఫేవరెట్‌ జట్లు ఇప్పుడు అనూహ్యంగా ఓటముల పాలవుతున్నాయి. దీంతో లీగ్‌స్టేజ్‌ పూర్తయ్యేసరికి ఎవరు ఎక్కడ నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో జట్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

జోరుగా లఖ్​నవూ.. లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ మంచి ప్రదర్శన కొనసాగిస్తూ దాదాపుగా ప్లేఆఫ్స్​ బెర్తును ఖరారు చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్​లో కోల్​కతాపై గెలిచి తన 8వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఫ్లేఆఫ్స్​ దిశగా మరో అడుగు ముందుకేసినట్టైంది. ఇప్పటివరకు వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకుంది.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిస్తోంది. ఆటగాళ్లందరూ మంచి ఫామ్​లోనే ఉన్నారు. వీరంతా తమ జోరును ఇలానే కొనసాగిస్తే ఇక ఈ జట్టుకు తిరుగుండదు.

గుజరాత్‌ ఇలాగే ఆడితే.. హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో ఇన్ని రోజులు వరుస విజయాలతో దూసుకుపోయిన గుజరాత్‌ గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండి.. ప్లేఆఫ్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నప్పటికీ.. ఈ ఓటములు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ముంబయి, ఏడో స్థానంలో ఉన్న పంజాబ్‌ చేతుల్లో ఓటమిపాలైంది. దీంతో ఇదే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయంగా మారింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌ వైఫల్యమే గుజరాత్‌ కొంపముంచింది. ఆ జట్టుకు మిడిల్‌ ఆర్డర్‌లో వెన్నెముకలా ఉండే డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా లాంటి ఆటగాళ్లు ఉన్నా శుక్రవారం రాత్రి ముంబయితో ఆడిన మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఒకవేళ ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లోనూ గుజరాత్‌ ఇలాగే విఫలమైతే పాయింట్ల పట్టికలో టాప్‌-4లో వెనుకపడే ప్రమాదం ఉంది.

ప్లేఆఫ్స్​కు చేరువగా రాజస్థాన్‌.. కానీ.. బ్యాటింగ్‌లో జోస్‌బట్లర్‌ చెలరేగుతుండటం వల్ల అద్భుత విజయాలు సాధించి టాప్‌ రెండులోకి దూసుకుపోయిన రాజస్థాన్ ఇటీవల వరుసగా రెండు మ్యాచ్‌లు ఓటమిపాలై మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా చివర్లో కొనసాగుతున్న కోల్‌కతా, ముంబయి చేతుల్లోనే విఫలమవ్వడం గమనార్హం. అయితే శనివారం జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్‌ మళ్లీ అదరగొట్టి ప్లే ఆఫ్స్​కు చేరే అవకాశాలను పదిలం చేసుకుంది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పంజాబ్‌పై సత్తాచాటింది. ఆరంభ మ్యాచ్‌ల్లో పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమై.. తిరిగి వచ్చిన యశస్వి జైశ్వాల్‌ అర్ధశతకం.. బట్లర్‌, హెట్‌మయర్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. చాహల్‌ మాయ.. వెరసి ఏడో విజయంతో రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది.
ఇక మొత్తంగా జట్టు ప్రదర్శన చూస్తే.. పంజాబ్​తో​ మ్యాచ్​ ముందు వరకు.. బ్యాటింగ్‌లో బట్లర్‌ లేదంటే కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాత్రమే రాణిస్తున్నారు. మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. తర్వాత వచ్చే డారిల్‌ మిచెల్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ లాంటి ఆటగాళ్లు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్నా విఫలమవుతున్నారు. కానీ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో దేవదత్​ పడిక్కల్​, హెట్​మెయిర్​ మళ్లీ దారిలో పడ్డారు. కాబట్టి వీళ్లు తన ఫామ్​ను కొనసాగిస్తే రాజస్థాన్​ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

హైదరాబాద్​ పరిస్థితి ఇదీ.. తొలి రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్‌ వరుసగా ఐదు విజయాలు సాధించి అభిమానుల్లో సంతోషం నింపింది. కానీ, గత మూడు మ్యాచ్‌ల్లో మళ్లీ ఓటములపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం విలియమ్సన్‌ నేతృత్వంలో బ్యాటింగ్‌ పరంగా బాగున్నా.. బౌలింగ్‌లోనే ధారాళంగా పరుగులిస్తోంది. ఇటీవల ఆ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోని గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. బౌలింగ్‌లో కాస్త జాగ్రత్త పడితే హైదరాబాద్‌ పుంజుకునే వీలుంది. ఒకవేళ ఈ విషయంలో మార్పు చేసుకోకపోతే గతేడాదిలాగే ప్లేఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో కనీసం 3 గేమ్స్‌ తప్పక గెలవాలి.

బెంగళూరు గాడిలో పడాలి.. ఇక బెంగళూరు సీజన్‌ ఆరంభంలో పలు విజయాలతో మంచి స్థితిలో నిలిచినా మధ్యలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓటములపాలై కాస్త కంగారు పెట్టింది. కానీ, గత మ్యాచ్‌లో చెన్నైపై గెలుపొంది మళ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తోంది. నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. టాప్ ఆర్డర్‌లో కోహ్లీ, అనూజ్‌ రావత్, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే మిడిల్‌ ఆర్డర్‌లో మొదట్లో దంచికొట్టి భారీ అంచనాలు నెలకొల్పిన దినేశ్‌ కార్తీక్‌ సైతం ఇటీవల రాణించలేకపోతున్నాడు. అతడు మళ్లీ బ్యాట్‌ ఝుళిపిస్తే తప్ప ఆ జట్టు పూర్తి స్థాయిలో గాడిలో పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నా ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్స్‌లో టాప్‌ రెండులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. లేదంటే మిగతా జట్లతో పోటీపడాల్సి ఉంటుంది.

రేసులోకి దూసుకొచ్చిన దిల్లీ.. మరోవైపు నిన్న మొన్నటి వరకు దిగువ స్థాయిలో కొనసాగిన దిల్లీ ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ, ఒక్కో మ్యాచ్‌ ఓడిపోతూ పాయింట్ల పట్టికలో కొట్టుమిట్టాడుతుతోంది. హైదరాబాద్‌ మాదిరే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయం సాధించిన పాయింట్ల పట్టికలో ఐదో స్థానాల్లో కొనసాగుతోంది. ఇకపై ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగతా మ్యాచ్‌ల్లో గట్టి పోటీనివ్వాలి. కానీ, ఈ జట్టు పరిస్థితి చూస్తుంటే అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీంతో ఇది టాప్‌-4లో నిలవాలంటే శక్తికి మించి రాణించాలి.

పంజాబ్​, కోల్​కతా కష్టమే: పంజాబ్​​ కూడా దిల్లీ తరహాలో ఒక్కో మ్యాచ్​ గెలుస్తూ.. ఒక్కో మ్యాచ్​ ఓడుతూ పాయింట్ల పట్టికలో ఊగిసలాడుతోంది. శనివారం జరిగిన మ్యాచ్​లోనూ రాజస్థాన్​పై ఓడిపోయింది. మొత్తంగా 11 మ్యాచ్‌ల్లో ఆరో ఓటములతో తన ప్లే ఆఫ్స్​ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక కోల్​కతా కూడా శనివారం జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూపై ఓడిపోయింది. బౌలర్లు పర్వాలేదనిపించినా.. బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల పరంగా చూస్తే.. సరైన ప్రదర్శన చేయలేక పాయింట్ల పట్టికలో జట్టు కొట్టుమిట్టాడుతోంది. ఆడిన 11 మ్యాచుల్లో నాలుగింటిలో మాత్రమే గెలిచి కింద నుంచి మూడో స్థానంలో ఉంది. మరి మిగతా మ్యాచుల్లోనైనా ఈ రెండు జట్లు ఎలా ప్రదర్శన చేస్తాయో చూడాలి.

ఇదీ చూడండి: 'ఐపీఎల్​లో గౌరవం దక్కలేదు'.. స్టార్​ క్రికెటర్​ షాకింగ్ కామెంట్స్!

Last Updated : May 8, 2022, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.