IPL 2022: ఐపీఎల్ 2022 ఆరంభంలోనే ముంబయి ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ తగలనుంది! ఈ మెగా టోర్నీలో మార్చి 27న తన తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది ముంబయి. అయితే, ఈ మ్యాచ్‌కు ప్రధాన బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడు ఇటీవల గాయపడటం వల్ల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. అతడింకా కోలుకోలేకపోవడం వల్ల దిల్లీతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడించొద్దని ముంబయి యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తొలి మ్యాచ్ తర్వాత ముంబయి ఏప్రిల్ 2న రాజస్థాన్‌తో రెండో మ్యాచ్‌లో ఆడనుంది. అప్పటికల్లా సూర్యకుమార్ కోలుకుంటాడని ఆశిస్తోంది. కాగా, ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.
ముంబయి శిబిరంలో రోహిత్, బుమ్రా..
-
Always something special about catching up with faMIliar faces! 😎💙#OneFamily #MumbaiIndians @ImRo45 @MahelaJay @ShaneBond27 MI TV pic.twitter.com/Zi1KME46e7
— Mumbai Indians (@mipaltan) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Always something special about catching up with faMIliar faces! 😎💙#OneFamily #MumbaiIndians @ImRo45 @MahelaJay @ShaneBond27 MI TV pic.twitter.com/Zi1KME46e7
— Mumbai Indians (@mipaltan) March 15, 2022Always something special about catching up with faMIliar faces! 😎💙#OneFamily #MumbaiIndians @ImRo45 @MahelaJay @ShaneBond27 MI TV pic.twitter.com/Zi1KME46e7
— Mumbai Indians (@mipaltan) March 15, 2022
మరోవైపు ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం శ్రీలంకతో పింక్ బాల్ టెస్టు పూర్తయ్యాక వెంటనే తన భార్య రితిక, కుమార్తె సమైరాతో కలిసి ఆ జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. అతడితో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం ముంబయిలో వాలిపోయాడు. వీరిద్దరూ లంకతో అంతర్జాతీయ క్రికెట్ ఆడటం వల్ల బయోబబుల్‌లోనే ఉన్నారు. దీంతో వారు ఇప్పుడు విడిగా మూడు రోజుల క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా జట్టుతో కలిసిపోయారు.
-
A very happy marriage anniversary to Boom & Sanjana! 💙💙
— Mumbai Indians (@mipaltan) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Paltan, drop your wishes for them 👇#OneFamily #MumbaiIndians @Jaspritbumrah93 @SanjanaGanesan pic.twitter.com/J0Mk4zRpWD
">A very happy marriage anniversary to Boom & Sanjana! 💙💙
— Mumbai Indians (@mipaltan) March 15, 2022
Paltan, drop your wishes for them 👇#OneFamily #MumbaiIndians @Jaspritbumrah93 @SanjanaGanesan pic.twitter.com/J0Mk4zRpWDA very happy marriage anniversary to Boom & Sanjana! 💙💙
— Mumbai Indians (@mipaltan) March 15, 2022
Paltan, drop your wishes for them 👇#OneFamily #MumbaiIndians @Jaspritbumrah93 @SanjanaGanesan pic.twitter.com/J0Mk4zRpWD
ఇదీ చూడండి: IPL 2022: అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్.. ఏ జట్టుకంటే?