ETV Bharat / sports

సన్​రైజర్స్​కు భారీ ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్​కు గాయం - సన్​రైజర్స్​ హైదరాబాద్​ వాషింగ్టన్​ సుందర్​కు గాయం

Sunrisers Hyderabad player injured: సన్​రైజర్స్​ హైదరాబాద్​కు​ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆ జట్టుకు చెందిన ఆటగాడు ​ గాయపడ్డాడు. తదుపరి మ్యాచుల్లో అతడు అందుబాటులో ఉండటం లేదా అనేది అనుమానంగా మారింది.

IPL 2022 Sunrisers Hyderabad Washington sundar injured
వాషింగ్ట్​ సందర్​కు గాయం
author img

By

Published : Apr 12, 2022, 11:31 AM IST

Sunrisers Hyderabad Washington sundar injured: విజయోత్సాహంలో ఉన్న సన్​రైజర్స్​ హైదరాబాద్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​కు గాయమైంది. ఈ కారణంగా తదుపరి జరగాల్సిన రెండు మ్యాచ్​లకు సుందర్ దూరం కానున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సన్​రైజర్స్​ హెడ్​కోచ్ టామ్​ మూడీ తెలిపారు. గుజరాత్​ టైటాన్స్​-ఎస్​ఆర్​హెచ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో మూడు ఓవర్లు వేసిన వాషింగ్టన్​​ 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అప్పటికే అతడి చేతికి గాయమైంది. దీంతో తన బౌలింగ్​ కోటా పూర్తిచేయకుండానే వెనుదిరిగాడు.

"వాష్టింగ్టన్​ కుడి చేతి బొట వేలు, మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది. రాబోయే రెండు మూడు రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి. అతడు కోలుకోవడానికి ఓ వారం రోజు పట్టొచ్చు" అని టామ్​మూడీ తెలిపాడు.

కాగా, ఈ ఐపీఎల్​లో చెన్నైసూపర్​ కింగ్స్​పై గెలుపుతో బోణీ కొట్టిన సన్​రైజర్స్​.. సోమవారం జరిగిన మ్యాచ్​లో గుజరాత్​పై 8 వికెట్ల తేడాతో గెలిచి తన ఖాతాలో రెండో విజయాన్ని వేసుకుంది.

ఇదీ చూడండి: షమీపై హార్దిక్​ ఫైర్​.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.