IPL 2022 Sunrisers Hyderabad New Jersy: ఐపీఎల్ 2022 కోసం కొత్త జెర్సీనీ ఆవిష్కరించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. 'సరికొత్త ఆరెంజ్ ఆర్మర్.. రెడీ టు రైస్' అని క్యాప్షన్ జోడించింది.
కాగా, ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్‌కు ఘోర పరాభవం ఎదురైంది. 14 మ్యాచులు ఆడి కేవలం మూడింటిలో మాత్రమే గెలిచింది. కెప్టెన్‌గా వార్నర్‌ను తొలగించడటం సహా తుది జట్టులో చోటు కల్పించకపోవడం వల్ల విమర్శలను ఎదుర్కొంది.
-
Presenting our new jersey.
— SunRisers Hyderabad (@SunRisers) February 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
The #OrangeArmour for the #OrangeArmy 🧡#ReadyToRise #IPL pic.twitter.com/maWbAWA0pc
">Presenting our new jersey.
— SunRisers Hyderabad (@SunRisers) February 9, 2022
The #OrangeArmour for the #OrangeArmy 🧡#ReadyToRise #IPL pic.twitter.com/maWbAWA0pcPresenting our new jersey.
— SunRisers Hyderabad (@SunRisers) February 9, 2022
The #OrangeArmour for the #OrangeArmy 🧡#ReadyToRise #IPL pic.twitter.com/maWbAWA0pc
ఇక రిటెన్షన్‌లో కేన్ విలియమ్సన్(రూ.14కోట్లు), అబ్దుల్ సమద్(రూ.4కోట్లు), ఉమ్రాన్ మలిక్(రూ.4కోట్లు) అట్టిపెట్టుకుంది. ఈ సీజన్ కోసం సిబ్బందికి సంబంధించిన జట్టులోనూ కొన్ని మార్పులు చేసింది. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా.. సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంచుకుంది. డేల్ స్టెయిన్‌ను పేస్ బౌలింగ్ కోచ్‌గా, హెమంగ్ బదానీని ఫీల్డింగ్ కోచ్‌గా, టామ్ మూడీని హెడ్ కోచ్‌గా తీసుకున్నట్లుగా ఎస్ఆర్హెచ్ తెలిపింది. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌తో తమ ప్రయాణం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: IND VS WI: సూర్యకుమార్ హాఫ్‌సెంచరీ.. విండీస్ లక్ష్యం ఎంతంటే?
సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా లారా.. కొత్త కోచింగ్ టీమ్ ఇదే