IPL 2022 Sarfaraz Khan: అండర్-19 ప్రపంచకప్ టోర్నీల్లో రెండు సార్లు భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే అతడు తన దూకుడు ఎక్కువ కాలం చూపలేకపోయాడు. గత కొన్ని సీజన్ నుంచి ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. అయితే గతేడాది పంజాబ్ తరఫున ఆడిన ఇతడిని ఈ సారి మెగా వేలంలో దిల్లీ క్యాపిటల్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. త్వరలోనే ఈ మెగాటోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఈ లీగ్‌లో కొత్త జెర్సీ ధరించి ఆడడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు. తనపై నమ్మకం ఉంచాలని దిల్లీ జట్టు యాజమాన్యాన్ని కోరాడు.
"ఏ జట్టు అయినా నాపై నమ్మకం ఉంచితే బాగా రాణించగలను. టీ20, వన్డే మ్యాచుల్లో సరిగ్గా రాణించలేనని అందరూ భావిస్తున్నారు. కానీ నాకు అవకాశం ఇస్తే బాగా ఆడతా. నేను కూడా ఐపీఎల్లో మంచి స్కోరు చేసే రోజు వస్తుంది"
-సర్ఫరాజ్ ఖాన్
సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు ఐపీఎల్లో 40 మ్యాచులు ఆడి కేవలం 441 పరుగులే సాధించాడు. 2015 నుంచి 2018 వరకు ముంబయి ఇండియన్స్, 2019 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఇటీవలే జరిగిన రంజీ ట్రోఫీ 2021-22లో మూడు మ్యాచులు ఆడి 551 పరుగులు చేశాడు. 137.75 సగటుతో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కాగా, మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడబోతున్నాడు. ఐపీఎల్ కప్‌ను ఐదు సార్లు గెలుచుకున్న ముంబయి ఇండియన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్ మార్చి 27న తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది.
ఇదీ చదవండి: ఝులన్ గోస్వామి రికార్డు.. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు