IPL 2022 RCB VS PBKS: టైటిల్ కోసం ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి పోరాడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 28 సార్లు తలపడ్డాయి. 15 మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ గెలవగా 13 మ్యాచుల్లో ఆర్సీబీ విజయం సాధించింది. పంజాబ్‌కు మయాంక్ అగర్వాల్, బెంగళూరుకు డుప్లెసిస్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్‌లో చెన్నైకు ఆడిన డుప్లెసిస్ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక కేఎల్ రాహుల్ వెళ్లిపోవడం వల్ల మయాంక్‌కు పంజాబ్ పగ్గాలు దక్కాయి.
తుది జట్ల వివరాలివీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, రూథర్‌పోర్డ్, అహ్మద్, హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్( కెప్టెన్), శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్, రాజపక్స, షారుఖ్ ఖాన్, ఓడెన్ స్మిత్, రాజ్ బవా, అర్ష్‌దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, రాహుల్ చాహర్.
ఇదీ చదవండి: IPL 2022 CSK: 'కెప్టెన్సీపై గతేడాదే నిర్ణయం తీసుకున్నాం'