ETV Bharat / sports

ఐపీఎల్​లో కోట్లకు పడగలెత్తిన ప్లేయర్లు.. కోహ్లీది మూడో స్థానమే - ఐపీఎల్​లో అత్యధిక సంపాదన

IPL 2022: ఐపీఎల్.. ఈ క్యాష్ రిచ్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్స్​లో ఐపీఎల్​కు ఉన్న క్రేజే వేరు. ఈ లీగ్ ద్వారా ఆటగాళ్లతో పాటు బీసీసీఐకి కూడా కాసుల పంట పండుతూనే ఉంది. ప్రతి ఏటా ఐపీఎల్​కు డిమాండ్ పెరుగుతుండడం వల్ల ఆటగాళ్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. మరి.. ఇప్పటి వరకు లీగ్​ చరిత్రలో ఐపీఎల్​ ద్వారా అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లు ఎవరో తెలుసా?

IPL 2022
players-who-have-earned-the-most-money-in-ipl-history
author img

By

Published : Mar 26, 2022, 3:22 PM IST

IPL 2022: దేశంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. క్రికెట్ ప్రియుల దృష్టంతా ఈ మహా సంగ్రామంపైకి మళ్లింది. ఈ ఏడాది లీగ్​లోకి కొత్తగా చేరిన రెండు జట్లతో కలిపి మొత్తం పది జట్లు తలపడనున్నాయి. క్రీడా ప్రపంచంలో ఉన్న లీగ్స్​ అన్నింటిలో ఐపీఎల్​ రూటే వేరు. ఏ లీగ్​ ఇవ్వలేని లాభాల్ని ఐపీఎల్​ ఆటగాళ్లతో పాటు బీసీసీఐకు ఇస్తుంది. ఇప్పటివరకు లీగ్​ చరిత్రలో కొందరు ఆటగాళ్లు వంద కోట్ల రూపాయలకు పైగా ఆర్జించారు. ఇక, ఐపీఎల్​లో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లు ఎవరు? ఎంతెంత సంపాదించారు? వంటి వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..

Players Who Have Earned The Most Money In IPL History
ఏబీ డివిలియర్స్: దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. 2022 ఐపీఎల్​ మెగా వేలంలో పాల్గొనలేదు. ఇప్పటివరకు మిస్టర్​ 360 మొత్తం రూ.1,02,51,65,000 (100 కోట్లకు పైగా) సంపాదించి లీగ్ లో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. డివిలియర్స్​ గతేడాది క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

సురేష్ రైనా: ఒకప్పుడు టీమ్​ఇండియా మిడిలార్డర్​లో ధనాధన్​ బ్యాటింగ్​తో అదరగొట్టిన రైనా.. తర్వాత ఫామ్​ కోల్పోయాడు. చాలాకాలం పాటు తుది జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూసి అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక, ఐపీఎల్​లో అయినా అతడి ఆట చూడొచ్చనుకున్న అభిమానులకు ఫ్రాంఛైజీలు నిరాశ మిగిల్చాయి. రైనాను ఈ ఏడాది ఏ జట్టు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కాగా, ఇప్పటివరకు ఇతడు రూ. 1,10,74,00,00 (రూ. 110 కోట్లకు పైగా) సంపాదించాడు. రైనా తన ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువ భాగం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు.

విరాట్​ కోహ్లీ: 2013 నుంచి 2021 వరకు రాయల్​ ఛాలెంజర్స్​ జట్టు సారథిగా వ్యవహరించిన విరాట్​ కోహ్లీ ఒక్క సారి కూడా జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడు. అయితే ఇప్పటివరకు లీగ్​ చరిత్రలో కోహ్లీ రూ.1,58,20,00,000 (రూ. 150 కోట్లకు పైగా) ఆర్జించాడు. గత నాలుగు సీజన్లుగా బెంగుళూరు ఫ్రాంఛైజీ.. కోహ్లీకి రూ.17 కోట్లు చెల్లిస్తుండగా.. ఈ ఏడాది రూ.15 కోట్లు ఇవ్వనుంది.

రోహిత్​ శర్మ: ఐపీఎల్​ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్​గా పేరు సంపాదించిన ముంబయి జట్టు సారథి రోహిత్​ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు లీగ్​ చరిత్రలో హిట్​మ్యాన్​ రూ.1,62,60,00,000 ( రూ. 160 కోట్లకు పైగా) సంపాదించాడు. ఈ ఏడాది ముంబయి జట్టు రోహిత్​కు రూ.16 కోట్లు చెల్లించనుంది. లీగ్​ చరిత్రలో అత్యధికంగా అయిదు సార్లు కప్పును అందించాడు హిట్​మ్యాన్​.

ఎంఎస్​ధోనీ: చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్​ ధోనీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్​లో అతడి మొత్తం సంపాదన రూ. 1,64,84,00,000 (రూ. 164 కోట్లకు పైగా) ఉంది. గత నాలుగు సీజన్లలో చెన్నై జట్టు ధోనీకి ఏటా 15 కోట్ల రూపాయిలు చెల్లించింది. అయితే ఈ ఏడాది అతడి జీతం 12 కోట్లకు తగ్గించింది.

ఇదీ చదవండి: IPL 2022: హ్యాట్రిక్ వికెట్ల వీరులు వీరే.. రోహిత్​ శర్మ సహా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.