ETV Bharat / sports

ఆరెంజ్​​, పర్పుల్​ క్యాప్​ ఎవరిదగ్గర?.. ఏ జట్టు టాప్​..

IPL 2022: ఐపీఎల్​ 2022 ఉత్కంఠభరితంగా సాగుతోంది. మంగళవారం వరకు 13 మ్యాచ్​లు ముగిశాయి. మరి ఇప్పటివరకు ఏ జట్టు పాయింట్ల పట్టికలో టాప్​లో ఉంది. ఏ జట్టు ఆఖర్లో ఉంది. ఇప్పటివరకు ఎవరు అత్యధిక పరుగులు చేశారు. ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు?

IPL 2022: Orange Cap and Purple Cap lists after RR vs RCB

author img

By

Published : Apr 6, 2022, 12:30 PM IST

IPL 2022: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 15వ ఎడిషన్​ ఆసక్తికరంగా సాగుతోంది. హోరాహోరీ మ్యాచ్​లు, ఉత్కంఠభరిత ఛేజింగ్​లు, ఆటగాళ్ల రికార్డు ప్రదర్శనలతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచ్​లు ముగిశాయి. ఐదుసార్లు టైటిల్​ గెల్చిన ముంబయి ఇండియన్స్​, డిఫెండింగ్​ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​, ఓసారి కప్​ గెలిచిన సన్​రైజర్స్​ 2022 ఐపీఎల్​లో ఇంకా ఖాతా తెరవకపోవడం గమనార్హం. చెన్నై ఆడిన మూడింట్లో ఓడగా.. ముంబయి, సన్​రైజర్స్​ రెండేసి మ్యాచ్​ల్లో ఓడిపోయాయి. కొత్త జట్టు గుజరాత్​ టైటాన్స్​ ఆడిన రెండిట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో కొత్త టీం లఖ్​నవూ కూడా రెండు మ్యాచ్​ల్లో గెలిచింది. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో ఓసారి పాయింట్ల పట్టిక చూద్దాం.

IPL 2022
పాయింట్స్​ టేబుల్​

ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్​ క్యాప్​, అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్​ క్యాప్​ ఇస్తారు. మ్యాచ్​లు జరుగుతున్నప్పుడు ఆయా ఆటగాళ్లు వీటిని ధరించాల్సి ఉంటుంది. మంగళవారం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య మ్యాచ్​ జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన రాయల్స్​ ఓపెనర్​ జోస్​ బట్లర్​ వద్ద ఆరెంజ్​ క్యాప్​ ఉంది. బట్లర్​ 3 మ్యాచ్​ల్లో 102.5 సగటుతో 205 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. 2 మ్యాచ్​ల్లో 135 పరుగులు చేసిన ముంబయి బ్యాటర్​ ఇషాన్​ కిషన్​ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్​లో ఎవరెవరున్నారో ఓసారి చూడండి.

BUTLER
జోస్​ బట్లర్​- ఆరెంజ్​ క్యాప్​

ఆరెంజ్​ క్యాప్​(అత్యధిక పరుగుల వీరులు)

  1. జోస్​ బట్లర్ ​(రాజస్థాన్​ రాయల్స్​) - 205 (3 మ్యాచ్​లు)
  2. ఇషాన్​ కిషన్ ​(ముంబయి ఇండియన్స్​) - 135 (2 మ్యాచ్​లు)
  3. ఫాఫ్​ డుప్లెసిస్ ​(రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు) - 122 (3 మ్యాచ్​లు)
  4. దీపక్​ హుడా (లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​) - 119 (3 మ్యాచ్​లు)
  5. శివం దూబే (చెన్నై సూపర్​ కింగ్స్​) - 109 (3 మ్యాచ్​లు)
IPL 2022
అత్యధిక పరుగుల వీరులు

పర్పుల్​​ క్యాప్​(అత్యధిక వికెట్ల వీరులు- 3 మ్యాచ్​ల్లో)

umesh yadav
ఉమేశ్​ యాదవ్​- పర్పుల్​ క్యాప్​
IPL 2022
అత్యధిక వికెట్ల వీరులు
  1. ఉమేశ్​ యాదవ్ ​(కోల్​కతా నైట్​రైడర్స్​) - 8 వికెట్లు
  2. యుజ్వేంద్ర చాహల్ ​(రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు) - 7
  3. అవేశ్​ ఖాన్​ (లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​) - 7
  4. రాహుల్​ చాహర్​ (పంజాబ్​ కింగ్స్​) - 6
  5. వనిందు హసరంగ ( రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు) - 6

ఇవీ చూడండి: 'అతడిని దక్కించుకోవడమే ఐపీఎల్​ వేలంలో అత్యుత్తమ కొనుగోలు'

'ఆ పర్యటన నా జీవితాన్నే మార్చేసింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.