IPL 2022: ఐపీఎల్ అంటేనే దుమ్మురేపే బ్యాటింగ్.. ఊహకందని క్యాచ్‌లు.. వావ్ అనిపించే యార్కర్లు.. ఒక్కటేమిటి ప్రతి క్షణం ఏమవుతుందా అని క్రికెట్ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. ఈ మెగా టోర్నీలో బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. వారిని తక్కువ పరుగులకే కట్టడి చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల్లో ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మెగాలీగ్ చరిత్రలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్లు ఎవరో ఓ సారి తెలుసుకుందాం..
ప్రవీణ్ కుమార్..
భారత మాజీ స్వింగ్ బౌలర్ ప్రవీణ్ కుమార్ ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 14 మెయిడెన్ ఓవర్లు వేశాడు. 119 మ్యాచ్‌లాడి 90 వికెట్లు తీశాడు. ఈ మెగా టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
ఇర్ఫాన్ పఠాన్
ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు ఇర్ఫాన్ పఠాన్. లీగ్‌లో ఇప్పటి వరకు 103 మ్యాచ్‌లాడి 80 వికెట్లు దక్కించుకున్నాడు. మొత్తంగా కెరీర్లో అత్యధికంగా 10 మెయిడెన్ ఓవర్లు వేసి రెండో స్థానంలో నిలిచాడు.
మూడోస్థానంలో భువీ
టీమ్‌ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు 132 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. తొమ్మిది మెయిడిన్ ఓవర్లు వేసి మూడో స్థానంలో నిలిచాడు. ఈ సన్‌రైజర్స్ ఆటగాడు ఐపీఎల్ బౌలింగ్ ఎకానమీలోనూ టాప్‌లో ఉన్నాడు.
ఇదీ చూడండి:
IPL 2022: ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరుకునే జట్లు ఇవేనా?
IPL 2022: ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు!