ETV Bharat / sports

ఖలీల్​, సకారియాకు, రాజ్​ బవాకు సూపర్​ రెస్పాన్స్​- యశ్​ ధుల్​ ప్చ్​..

IPL 2022 Mega auction: రెండో రోజు మధ్యాహ్నం తర్వాత జరిగిన వేలంలో.. ఖలీల్​ అహ్మద్​, చేతన్​ సకారియా పంట పండింది. వీరి కోసం వరుసగా రూ. 5.25 కోట్లు, రూ. 4.20 కోట్లు వెచ్చించింది దిల్లీ క్యాపిటల్స్​. అండర్​-19 వరల్డ్​కప్​లో అదరగొట్టిన భారత ఆల్​రౌండర్​ రాజ్​ బవా రూ. 2 కోట్లకు అమ్ముడయ్యాడు. కెప్టెన్​ యశ్​ ధుల్​కు రూ. 50 లక్షలే దక్కాయి.

IPL 2022 Mega auction
యశ్​ ధుల్​ ప్చ్
author img

By

Published : Feb 13, 2022, 4:20 PM IST

Updated : Feb 13, 2022, 4:34 PM IST

IPL 2022 Mega auction: కొన్నేళ్లుగా సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ఆడిన పేసర్​ ఖలీల్​ అహ్మద్ ఐపీఎల్​ వేలంలో​ అదరగొట్టాడు. ఇతడి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరికి దిల్లీ రూ. 5.25 కోట్లకు సొంతం చేసుకుంది. రాజస్థాన్​కు ఆడిన చేతన్​ సకారియాను కూడా రూ. 4.20 కోట్లు పెట్టి కొనుక్కుంది.

  • లంక బౌలర్​ దుష్మంత చమీరాను రూ. 2 కోట్లకు లఖ్​నవూ దక్కించుకుంది.
  • అండర్​-19 వరల్డ్​ కప్​లో అదరగొట్టిన భారత ఆల్​రౌండర్​ రాజ్​ బావాను రూ. 2 కోట్లకు పంజాబ్​ సొంతం చేసుకుంది.
  • బౌలింగ్​లో ఇరగదీసిన రాజ్​వర్ధన్​ హంగార్గేకర్​ను రూ.1.50 కోట్లకు చెన్నై గెల్చుకుంది.
  • ఉత్తర్​ప్రదేశ్​ లెఫ్టార్మ్​ పేసర్​ యష్​ దయాల్​ కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడినా.. రూ.3.20 కోట్లకు గుజరాత్​ టైటాన్స్​ దక్కించుకుంది.

ఇంకా ఎవరెవరు ఎంతకు?

నవదీప్​ సైనీ - రూ.2.60 కోట్లు- రాజస్థాన్​ రాయల్స్

జయదేవ్​ ఉనద్కత్​ - రూ. 1.30 కోట్లు- ముంబయి ఇండియన్స్

తిలక్​ వర్మ - రూ.1.70 కోట్లు -ముంబయి ఇండియన్స్

సంజయ్​ యాదవ్​ - రూ.50 లక్షలు- ముంబయి ఇండియన్స్

మహిపాల్​ లొమ్రోర్​ - రూ.95 లక్షలు- ఆర్సీబీ

వీరికి నిరాశ..

IPL Mega auction Yash Dhull price: అండర్​-19 వరల్డ్​కప్​లో భారత్​ను గెలిపించిన సారథి యశ్​ ధుల్​కు తీవ్ర నిరాశ ఎదురైంది. రూ. 20 లక్షల కనీసధరతో వేలంలోకి వచ్చిన అతడిని రూ. 50 లక్షలకే దిల్లీ దక్కించుకుంది.

వరల్డ్​కప్​లో ఆకట్టుకున్న విక్కీ ఓస్త్వాల్​, హర్నూర్​ సింగ్​లను ఎవరూ తీసుకోలేదు.

విదేశీ ప్లేయర్లు ఇష్​ సోధీ, కాట్రెల్​, షంసీలపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు.

ఇదీ చూడండి: IPL Auction: గతేడాది రూ. 9 కోట్లు.. ఇప్పుడు 90 లక్షలు- ఎవరా ప్లేయర్​?

Last Updated : Feb 13, 2022, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.