ETV Bharat / sports

అయ్యో.. అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు బట్లర్​.. ఇద్దరిదీ ఓకే కథ! - కోహ్లీ బట్లర్ ఐపీఎల్ 2022

IPL 2022 Kohli Buttler: ఈ ఐపీఎల్​ సీజన్​లో రాజస్థాన్​ ప్లేయర్​ బట్లర్​కు ఎదురైన చేదు పరిస్థితే గతంలో కోహ్లీకీ కూడా ఎదురైంది. దీంతో వీరిద్దరిని పోలుస్తూ క్రికెట్​ ప్రియులు దాన్ని సోషల్​మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం..

Kohli Buttler
కోహ్లీ బట్లర్​
author img

By

Published : May 30, 2022, 7:01 PM IST

IPL 2022 Kohli Buttler: ఈ ఏడాది ఐపీఎల్​లో ఫైనల్​ చేరిన రాజస్థాన్​కు​ ఆరెంజ్​, పర్పుల్​ క్యాప్​ దక్కినప్పటికీ ట్రోఫీ మాత్రం కలగానే మిగిలిపోయింది. బ్యాటింగ్​లో ​ బట్లర్​, బౌలింగ్​లో చాహల్​ అదరగొట్టినా.. కప్​ మాత్రం మిస్ అయిపోయింది. అయితే ఇప్పుడు బట్లర్​కు ఎదురైన ఓ చేదు అనుభవమే ఆరేళ్ల కింద కోహ్లీకీ ఎదురైంది. ప్రస్తుతం అభిమానులు దీని గురించి సోషల్​మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు ఆడిన తీరు, తన టీమ్స్​ను ఫైనల్​కు తీసుకెళ్లిన విధానం.. ఇంకా చాలానే పోలికలు కలిశాయి.

2016లో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి.. ఒక సీజన్​లో అత్యధిక రన్స్​ చేసిన రికార్డును నమోదు చేశాడు. ఆ ఏడాది నాలుగు సెంచరీలు బాదాడు. ఆడినా ప్రతిమ్యాచ్​లోనూ చెలరేగిపోయి జట్టును ఫైనల్స్​కు చేర్చాడు. ఆ తుదిపోరులో హాఫ్​ సెంచరీ కొట్టినా సన్​రైజర్స్​ చేతిలో ఓటమి తప్పలేదు.

అయితే 2022లో బట్లర్​ది ఇదే పరిస్థితి. ఈ సీజన్​లో ఇతడే టాప్​ స్కోరర్​. కోహ్లీ రికార్డును అందుకోలేదు కానీ.. 863 పరుగులతో ఆరెంజ్​ క్యాప్​ను దక్కించుకున్నాడు. కోహ్లీ లాగే నాలుగు శతకాలు బాదాడు. ఫైనల్​లోనూ తన జట్టును గెలిపించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నించాడు. అయినా జట్టుకు ఓటమి తప్పలేదు.

ఇక ఆ సీజన్​లో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవగా.. ఈ సీజన్​లో రాజస్థాన్​ రెండో ప్లేస్​లోనే నిలిచింది. ఇక అప్పుడు, ఇప్పుడూ టాప్​లో గుజరాత్​ టీమే ఉండటం విశేషం. మరో విశేషమేమిటంటే.. అప్పుడు కోహ్లీ, ఇప్పుడు బట్లర్​.. మే 29నే ఫైనల్​ ఆడారు. ఇలా ఆ సీజన్​.. ఈ సీజన్​లో అనేక పోలీకలు కలిశాయి.

ఇదీ చూడండి: ఐపీఎల్​ 2022లో రికార్డుల మోత.. ఎవరెవరు ఏమేం సాధించారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.