ETV Bharat / sports

కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్​గా - కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు 500 పరుగులు

IPL 2022 KL Rahul Record: లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ఐపీఎల్​లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడు వరుసగా ఐదో సీజన్‌లోనూ 500 పైచిలుకు పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్​గా నిలిచాడు.

KL Rahul Record 500 runs
కేఎల్​ రాహుల్ 500 పరుగులు
author img

By

Published : May 19, 2022, 5:16 PM IST

IPL 2022 KL Rahul Record: లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ప్రస్తుతం జరుగుతోన్న భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడు వరుసగా ఐదో సీజన్‌లోనూ 500 పైచిలుకు పరుగులు సాధించిన బ్యాటర్​గా నిలిచాడు. 2008లో ఈ టోర్నీ ప్రారంభమవ్వగా ఎవ్వరూ ఇలా ఇన్నేళ్లు వరుసగా అన్ని పరుగులు సాధించలేదు. దీంతో రాహుల్‌ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఇక ఈ సీజన్‌లో అతడు ఇప్పటికే 14 మ్యాచ్‌లు ఆడగా.. 135.26 స్ట్రైక్ రేట్‌తో 537 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉండటం విశేషం. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ 627 పరుగులతో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. కాగా, రాహుల్‌ గతరాత్రి కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో (68 నాటౌట్‌; 51 బంతుల్లో 3x4, 4x6) మరోసారి మెరిసిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (140 నాటౌట్‌; 70 బంతుల్లో 10x4, 10x6)తో కలిసి ఒక్క వికెట్‌ పడకుండానే ఇన్నింగ్స్‌ పూర్తిచేసి మరో మేటి రికార్డులో భాగమయ్యాడు.

  • 2018లో 659
    2019లో 593
    2020లో 670 (ఆరెంజ్ క్యాప్)
    2021లో 626
    2022లో 537 * (ప్లేఆఫ్స్‌లో ఆడాల్సి ఉంది)

ఇదీ చూడండి: IPL: 'అలా జరగడం భరించలేకపోయా... ఐదేళ్లు బాధపడ్డా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.