IPL 2022 KL Rahul: ఐపీఎల్‌లో కొత్తగా చేరిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడైన కేఎల్ రాహుల్.. తన పాత జట్టు పంజాబ్ కింగ్స్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందో కారణం చెప్పాడు. మెగా టోర్నీకి ముందు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన అతడు అందుకు కారణాన్ని వివరించాడు.
'నేను పంజాబ్ జట్టులో నాలుగేళ్లు ఆడా. అక్కడ భారీగా పరుగులు చేశా. అయితే, ఈ సీజన్‌కు ముందు నా కెరీర్‌లో వేరే కొత్త అవకాశాలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలని చూశా. పంజాబ్‌ను వీడడం కష్టతరమైన నిర్ణయమే. ఆ జట్టుతో చాలా కాలం ఆడిన నేపథ్యంలో ఈసారి కొత్తగా ఏమైనా చేయగలనా అని ఆలోచించా' అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా, పంజాబ్‌ను వీడడం రాహుల్ సొంత నిర్ణయమని ఆ జట్టు కోచ్ అనిల్‌కుంబ్లే ఇంతకుముందే వెల్లడించాడు.
'మేం కచ్చితంగా రాహుల్‌ను అట్టిపెట్టుకోవాలని చూశాం. అందుకే రెండేళ్ల కిందటే అతడిని కెప్టెన్‌గా నియమించుకున్నాం. కానీ, అతడే వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవించాం. అది ఆటగాడి వ్యక్తిగత ఇష్టం' అని కుంబ్లే ఈ ఏడాది వేలం పాటకు ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదల చేసినప్పుడు వివరించాడు. కాగా, అప్పుడు పంజాబ్ కేవలం ఇద్దరి ఆటగాళ్లనే అట్టిపెట్టుకుంది. అందులో ఒకరు మయాంక్ అగర్వాల్ కాగా, మరొకరు యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్. ఇక ఇటీవల పంజాబ్ జట్టుకు మయాంక్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు.
ఇదీ చదవండి: ఈ ఐపీఎల్‌లోనైనా పాత విరాట్‌ను చూస్తామా..?