ETV Bharat / sports

IPL 2022 GT VS LSG: అరంగేట్రంలో అదరగొట్టేది ఎవరు?

IPL 2022 GT VS LSG: ఐపీఎల్​లో ఈ సీజన్​లోనే అరంగేట్రం చేస్తున్న గుజరాత్​ టైటాన్స్​, లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ జట్లు.. నేడు (సోమవారం) తలపడనున్నాయి. ఇరు జట్లలోనూ హార్డ్​ హిట్టింగ్​ ఆల్​రౌండర్లు ఉండటం మ్యాచ్​పై ఆసక్తి రేకెత్తిస్తోంది. పంజాబ్​ నుంచి లఖ్​నవూకు సారథిగా మారిన కేఎల్​ రాహుల్, తొలిసారి కెప్టెన్సీ చేపడతున్న హార్దిక్​ పాండ్య తమ ముద్ర వేస్తారో చూడాలి.

gt-vs-lsg-match-preview
gt-vs-lsg-match-preview
author img

By

Published : Mar 28, 2022, 8:12 AM IST

IPL 2022 GT VS LSG: జట్టు నిండా పవర్​హిట్టర్లతో ఉన్న గుజరాజ్​ టైటాన్స్​, లఖ్​నవూ సూపర్​జెయింట్స్​.. విజయంతో ఐపీఎల్​ వేటను ఆరంభించాలని ఆరాటపడుతున్నాయి. 15వ సీజన్​లో కొత్తగా చేరిన ఈ జట్లు సోమవారం తమ తొలి మ్యాచ్​లో పరస్పరం ఢీ కొనబోతున్నాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలబలాలు ఎలా ఉన్నాయంటే..

శుభ్​మన్ గిల్​, అఫ్గాన్ బ్యాటర్​-వికెట్​కీపర్​ రహ్మానుల్లా గుర్బాజ్​తో గుజరాత్​ ఓపెనింగ్​ చేయించవచ్చు. ఇక తమ సారథి హార్దిక్​పై ఆ జట్టు అధికంగా ఆధారపడే అవకాశం ఉంది. గతంలో ముంబయికి ఆడటం వల్ల వాంఖడే పిచ్​పై అతడికి అమితమైన అనుభవం ఉంటుంది. ఆల్​రౌండర్లు రాహుల్​ తెవాతియా, విజయ్​ శంకర్​ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్​ దళానికి మహ్మద్​ షమీ నాయకత్వం వహించనున్నాడు. రషీద్​ఖాన్​ కీలకం కానున్నాడు.

అతడిపైనే భారం: లఖ్​నవూ జట్టులో క్వింటన్​ డికాక్​తో ఓపెనింగ్​కు దిగనున్న కెప్టెన్​ కేఎల్​ రాహుల్​పైనే అధికంగా బాధ్యత ఉంది. దీపక్​ హుడా, కృనాల్​ పాండ్య, వెస్టిండీస్​ హిట్టర్​ జేసన్​ హోల్డర్​ లాంటి ఆల్​రౌండర్లు సహా మిడిల్​ఆర్డర్​లో మనీష్​ పాండే ముఖ్య భూమిక పోషించాలి. అవేశ్​ ఖాన్​ నేతృత్వంలోని బౌలింగ్​ విభాగం, రవి బిష్ణోయ్​ గూగ్లీలు గుజరాత్​ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: స్విస్​ ఓపెన్​ టైటిల్​ విజేతగా పీవీ సింధు.. ప్రణయ్​కు నిరాశ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.